POCO X8 Pro Max 5G | 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్‌గా కొత్త 5జీ ఫోన్!

POCO X8 Pro Max 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ పోకో తాజాగా విడుదల చేసిన పోకో X8 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. 9000 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ఇప్పుడు యూత్‌‌ను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

poco x8 pro max 5g mobile with 9000mAh battery here is full details and specifications

POCO X8 Pro Max 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో తాజాగా విడుదల చేసిన పోకో X8 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. మార్చి 17వ తేదీన ఈ మోడల్‌ను విడుదల చేయగా.. మార్చి 23వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. 9000 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ఇప్పుడు యూత్‌‌ను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ధరలు-ఆఫర్లు

POCO X8 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభమవుతుంది. 12GB+256జీబీ వేరియంట్ ధర రూ. 35,999 కాగా, ఐరన్‌మ్యాన్ ఎడిషన్ రూ.37,999గా ఉంది. ఇక POCO X8 Pro Max 5G ధర రూ.42,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ (12GB+512GB) ధరను రూ.46,999గా నిర్ణయించారు.

ఫ్లిప్ కార్ట్ ఫస్ట్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు కార్డులతో రూ.3వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా పోకో షీల్డ్ ప్రోగ్రామ్ కింద ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అందిస్తున్నారు. అలాగే యూట్యూబ్ ప్రీమియం ( రెండు నెలలు), స్పాటిఫై ప్రీమియం (మూడు నెలలు ) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు.

కలర్ ఆప్షన్లు

POCO X8 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక POCO X8 Pro Max 5G స్మార్ట్‌ఫోన్లలో బ్లాక్, వైట్‌తో పాటు బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఉంది.

ఫీచర్లు – స్పెసిఫికేషన్లు

* POCO X8 Pro 5G, POCO X8 Pro Max 5G రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్OS3పై పనిచేస్తాయి.

* ఈ రెండు మొబైల్‌లు 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో 120Hz రీఫ్రెష్ రేట్, 3500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి.

* IP66, IP68, IP69, IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తున్నాయి.

* పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పోకో X8 ప్రో 5జీ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. పోకో X8 ప్రో మ్యాక్స్ 5జీ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ రెండింటిలోనూ LPDDR5x RAM, UFS 4.1స్టోరేజ్ సపోర్ట్‌తో ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాయి. అలాగే 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి.

కెమెరా ఫీచర్లు

* ఈ రెండు ఫోన్లలోనూ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా (OISతో), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు కలవు. ఇందులో ఏఐ ఆధారిత ఇమేజింగ్ టూల్స్ కూడా సపోర్టు చేస్తాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు కూడా ఈ మొబైల్స్‌లో సపోర్టు అందిస్తున్నారు.

బ్యాటరీనే మెయిన్ హైలైట్!

పోకో X8 ప్రో మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా బ్యాటరీనే హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 9000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇక పోకో X8 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఇక రెండు ఫోన్లలో కూడా 100W ఫాస్ట్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్ సపోర్టు ఉన్నాయి.

హై కెపాసిటీ బ్యాటరీ, హై పర్ఫార్మెన్స్‌తో గేమింగ్ యూజర్లను ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలవనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More:

వివో నుంచి త్వరలోనే రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!

13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!

Latest News