లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్​లో కాదు

ప్రపంచంలోనే ఎత్తైన మహావిష్ణువు విగ్రహం ఎక్కడుందో తెలుసా? అమెరికాలోని స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ కంటే ఎత్తైన ఈ విగ్రహాన్ని గరుడ విష్ణు కేంసనగా పిలుస్తారు.

లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్​లో కాదు

బాలి (ఇండోనేషియా): హిందూ దేవతల అతి ఎత్తైన విగ్రహాలు కేవలం భారతదేశంలోనే ఉంటాయనుకుంటే పొరపాటు. ఇండోనేషియాలోని బాలి దీవి బుకిట్ ఉంగసాన్‌లో ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న గరుడ విష్ణు కేంసన (GWK) విగ్రహం దీనికి నిదర్శనం. గరుడుని అధిరోహించి కూర్చున్న మహావిష్ణువు రూపంలో నిర్మించిన ఈ మహాస్మారకం, ఇండోనేషియా సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక వారసత్వం, వాస్తు కళా ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది.

నిర్మాణ చరిత్ర

GWK ఆలోచన 1980లలో పుట్టింది. ఇది సాధారణ పర్యాటక ఆకర్షణ కాకుండా, దేశ గర్వానికి ప్రతీకగా ఉండాలని భావించారు. 1997లో నిర్మాణం ప్రారంభమైనా, ఆర్థిక సమస్యల వలన దీర్ఘ కాలం సమస్యలను ఎదుర్కొని, చివరికి 2018లో పూర్తి చేశారు.

  • ఎత్తు: 121 మీటర్లు (దాదాపు 400 అడుగులు)
  • రెక్కల విస్తీర్ణం: 64 మీటర్లు (210 అడుగులు)
  • నిర్మాణ పదార్థం: 3,000 టన్నుల కంచు, రాగి
  • ప్రత్యేకత: న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎక్కువ ఎత్తు

విగ్రహం బాలిలోనే ఎందుకు?

హిందూ సంప్రదాయంలో విష్ణువు విశ్వరక్షకుడు. ఆయన వాహనమైన గరుడుడు – స్వేచ్ఛ, ధైర్యం, విశ్వాసానికి చిహ్నం. ఇండోనేషియాలో గరుడుడు జాతీయ ప్రతీక కూడా (Garuda Pancasila). అందుకే ఈ విగ్రహం దేశ ఐక్యత, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.

బాలి లో హిందూమత చరిత్ర

భారతదేశం–దక్షిణాసియా సముద్ర వాణిజ్యం ద్వారా హిందూమతం 2,000 ఏళ్ల కిందట బాలి చేరింది. స్థానిక విశ్వాసాలు, జావా సాంస్కృతిక సంప్రదాయాలతో కలసి ప్రత్యేకమైన బాలి హిందూ సంప్రదాయం ఏర్పడింది. ఆలయాలు (పురా), రోజువారీ పూజలు (బంతెన్) ఇప్పటికీ బాలి జీవన విధానంలో ప్రధాన భాగం.

GWK కల్చరల్ పార్క్ ప్రత్యేకతలు

  • సాంప్రదాయ నృత్యాలు: ప్రతిరోజు బాలినీస్ డాన్సులు, పురాణ కథల ప్రదర్శనలు
  • శిల్ప కళ: రాతి శిల్పాలు, పురాణ దృశ్యాలు
  • జెండెలా బాలి రెస్టారెంట్: స్థానిక + అంతర్జాతీయ వంటకాలు, ప్యానోరమిక్ వ్యూ
  • పండుగలు: సంగీత కచేరీలు, సాంస్కృతిక ప్రదర్శనలు

 

వీడియో చూడండి:

 

View this post on Instagram

 

A post shared by TWIN | DRONE PILOT BALI (@twintraa)

ప్రవేశ వివరాలు

  • స్థానం: ఉంగసాన్, సౌత్ కూటా, బడుంగ్ రెజెన్సీ, బాలి
  • ఎయిర్పోర్ట్ నుంచి: 10–15 నిమిషాలు టాక్సీ
  • ప్రవేశ రుసుము: IDR 150,000 (₹808 సుమారు) – ఇందులో పార్క్ ప్రవేశం, 15 సాంస్కృతిక ప్రదర్శనలు, ఉచిత పానీయం, ASANA Artseum ఎంట్రీ ఉన్నాయి.
  • పని సమయం: ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు

సందర్శనకు ఉత్తమ సమయాలు

  • ఉదయం: తక్కువ సమూహాలు, చల్లటి వాతావరణం
  • సాయంత్రం: సువర్ణ కాంతి ఫొటోలు, సాంస్కృతిక పరేడ్, కెకాక్ డాన్స్
  • రాత్రి: వెలుగుల అలంకరణలో విగ్రహం, డిన్నర్ అనుభవం

గరుడ విష్ణు కేం‍సన విగ్రహం కేవలం ఒక స్మారకం కాదు – ఇది చరిత్ర, పురాణం, జాతీయ ఐక్యత, మరియు కళాత్మకతల  కలయిక. ఆకాశాన్ని తాకే ఈ మహావిష్ణువు, గరుడునితో కలిసి బాలి సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తున్నాడు.