Asia Cup Champions 2025 | ఆసియా కప్‌: ధైర్యం, నమ్మకం, జాతీయ పతాకం – ఇదే టీమిండియా గెలుపు మంత్రం

ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌పై విజయం సాధించి తొమ్మిదో టైటిల్ గెలుచుకుంది. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన, ఆటగాళ్ల ధైర్యం, విశ్వాసం ఈ గెలుపు వెనుక ప్రధాన శక్తి.

Asia Cup Champions 2025 | ఆసియా కప్‌: ధైర్యం, నమ్మకం, జాతీయ పతాకం – ఇదే టీమిండియా గెలుపు మంత్రం

Asia Cup Triumph: A Story of Grit, Faith and Pride for the Nation

దుబాయ్‌:
Asia Cup Champions 2025 | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో (Asia Cup 2025 Final) భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో నెగ్గి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలుపు కాదు — ధైర్యం, విశ్వాసం, జాతీయ పతాక గౌరవం కోసం పోరాటం అని మాజీ-ప్రస్తుత క్రికెటర్లు ఒకే స్వరంతో ప్రశంసించారు.

మ్యాచ్ చివర్లో రింకూ సింగ్ బౌండరీతో విజయాన్ని ముద్దాడగా.. తిలక్ వర్మ అద్భుత ఏకాగ్రతతో ఇన్నింగ్స్‌ భారమంతా మోసాడు. కుల్దీప్ యాదవ్ మంత్ర ముగ్ధం చేసే బౌలింగ్ స్పెల్‌తో పాకిస్థాన్‌ను కట్టడి చేశాడు. ఈ కాంబినేషన్ భారత్‌కు మరపురాని విజయాన్ని అందించింది.

ప్రముఖుల ప్రశంసలు

  • వీవీఎస్ లక్ష్మణ్: “ఈ విజయం ట్రోఫీ కంటే పెద్దది. ధైర్యం, నమ్మకం, జెండా కోసం ఆడిన ఆటగాళ్లందరికీ అభినందనలు. తిలక్ అసాధారణ పరిపక్వత చూపాడు.”
  • రవిశాస్త్రి: “ఉత్కంఠభరిత ఫైనల్‌లో యువ ఆటగాళ్లు చూపిన పరిపక్వత అద్భుతం. తిలక్ వర్మ కీలక సమయంలో ప్రశాంతంగా, నిబ్బరంగా ఆడాడు. అద్భుత ప్రదర్శన!.”
  • సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్): “ప్రత్యేక జట్టు.. ప్రత్యేక విజయం. ప్రతి క్షణం విలువైనది. ఇది మా యూనిట్ శ్రమ ఫలితం.”
  • యువరాజ్ సింగ్: “తిలక్ వర్మ ఇన్నింగ్స్ కోహ్లీ లాంటిది. ఒత్తిడిలోనూ నిలబడిన ఆత్మవిశ్వాసం అద్భుతం. అభిషేక్ శర్మ టోర్నమెంట్ ప్లేయర్‌గా వెలిగిపోయాడు.”
  • జయ్ షా (ఐసీసీ చైర్మన్): “టీమిండియా తన నిలకడ, అద్భుత ప్రతిభలను మరోసారి చాటింది. తొమ్మిదో టైటిల్‌ నిజంగా గర్వకారణం.”
  • హర్భజన్ సింగ్: “భారత్‌కా విజయ తిలక్‌. అద్భుతం తిలక్ వర్మ.”
  • ఇర్ఫాన్ పఠాన్: “తిలక్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటివరకు అతని కెరీర్‌లో బెస్ట్. పాకిస్థాన్‌ కు భారత్​కు మధ్య ఉన్న తేడా చాలా పెద్దది.. భారత్ చాలా ముందుంది.”
  • మహిళల లెజెండ్ జూలన్ గోస్వామి: “తిలక్ ధైర్యసాహసాలు, కుల్దీప్ అద్భుత బౌలింగ్ దేశాన్ని గర్వపడేలా చేశాయి.”

మ్యాచ్ ముగిసిన వెంటనే దుబాయ్ ఆకాశం టపాకాయల వెలుగులతో మెరిసిపోయింది. స్టేడియం నిండా “భారత్ మాతా కి జై” నినాదాలు మార్మోగాయి. ట్రోఫీ వివాదం ఉన్నప్పటికీ, భారత ఆటగాళ్లు జట్టు స్పూర్తితో ఊహాత్మక ట్రోఫీ లేపి అభిమానులకు సంతోషం పంచారు.