మాజీ క్రికెటర్ యశపాల్ శర్మ కన్నుమూత
విధాత,ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కాగా 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా యశ్‌పాల్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో ఆయన కీలకపాత్ర పోషించాడు.ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు సభ్యుడిగా యశ్‌పాల్ శర్మ ఉన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో […]

విధాత,ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కాగా 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా యశ్‌పాల్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో ఆయన కీలకపాత్ర పోషించాడు.
ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు సభ్యుడిగా యశ్‌పాల్ శర్మ ఉన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ వరల్డ్ కప్‌లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా యశ్‌పాల్ నిలిచారు.1983 వరల్డ్‌కప్ లీగ్ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 89 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున 37 టెస్టుల్లో 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. ఇందులో టెస్టుల్లో 2 సెంచరీలు ఉన్నాయి.
యశ్‌పాల్ శర్మ కెరీర్‌లో ముఖ్య విషయాలు:
►1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జననం
►1978 అక్టోబర్ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం.. మరుసటి ఏడాది 1979లో డిసెంబర్ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ
►1970,80ల కాలంలో భారత మిడిలార్డర్ క్రికెట్‌లో ముఖ్యపాత్ర
►1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు
►యశ్‌పాల్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు.
► విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్‌పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే అర్థంతరంగా ఆటకు వీడ్కోలు