Hardik Pandya|క‌ష్టాల్లో హార్ధిక్ పాండ్యా.. ఒక‌వైపు విడాకులు, మ‌రోవైపు కెప్టెన్సీ దూరం

Hardik Pandya| టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకి గ‌త కొద్ది రోజుల నుండి గ‌డ్డు ప‌రిస్థితులు న‌డుస్తున్నాయి. ఐపీఎల్‌లో రోహిత్‌ని కాదని హార్ధిక్ పాండ్యాకి ముంబై కెప్టెన్ బాధ్య‌త‌లు అప్ప‌గించడంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆయ‌న‌ని దారుణంగా ట్రోల్ చేశారు. మ‌రోవైపు ఐపీఎల్ టోర్నీ మొత్తం అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో తేలిపోవ‌డంతో ఆయ‌న‌ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కి కూడా ఎంపిక చేయోద్దంటూ డిమాండ్ చేశారు. కాని అత‌డిని ఎలాగోలా ఎంపి

  • By: sn    sports    Jul 19, 2024 7:52 AM IST
Hardik Pandya|క‌ష్టాల్లో హార్ధిక్ పాండ్యా.. ఒక‌వైపు విడాకులు, మ‌రోవైపు కెప్టెన్సీ దూరం

Hardik Pandya| టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకి గ‌త కొద్ది రోజుల నుండి గ‌డ్డు ప‌రిస్థితులు న‌డుస్తున్నాయి. ఐపీఎల్‌లో రోహిత్‌ని కాదని హార్ధిక్ పాండ్యాకి ముంబై కెప్టెన్ బాధ్య‌త‌లు అప్ప‌గించడంతో నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆయ‌న‌ని దారుణంగా ట్రోల్ చేశారు. మ‌రోవైపు ఐపీఎల్ టోర్నీ మొత్తం అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో తేలిపోవ‌డంతో ఆయ‌న‌ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కి కూడా ఎంపిక చేయోద్దంటూ డిమాండ్ చేశారు. కాని అత‌డిని ఎలాగోలా ఎంపిక చేయ‌డం జ‌రిగింది. అయితే టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీ రోల్ పోషించార‌నే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్​లోకూడా కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపుకి తిప్పాడు.

అయితే రోహిత్ టీ20ల‌కి గుడ్ బై చెప్ప‌డంతో హార్ధిక్ త‌దుప‌రి కెప్టెన్ అని అంతా భావించారు. కాని టీ20 జట్టుకు కొత్త రెగ్యులర్ కెప్టెన్‍గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‍ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‍లో అతడే కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నాడు.అయితే ప్లేయర్​గా హార్దిక్ స్కిల్స్​ మీద అనుమానాలు లేకపోయినా బిహేవియర్, యాటిట్యూడ్ అత‌నికి పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని, అందుకే అత‌నికి కెప్టెన్సీ ఇవ్వ‌లేద‌ని తెలుస్తుంది. పాండ్యా కెప్టెన్​గా అదే యాటిట్యూడ్​ను చూపిస్తే ఆటగాళ్లలో యూనిటీ కూడా దెబ్బ తింటుంద‌ని , అందుకే అత‌నికి కెప్టెన్సీ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని ఆలోచ‌న బీసీసీఐ చేసింద‌ని అంటున్నారు. సూర్య కుమార్ అందుబాటులో లేని ప‌క్షంలో గిల్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ని తీసుకోనున్నాడ‌ని అంతా భావిస్తున్నారు.

మ‌రోవైపు హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు త‌న ఇన్‌స్టా వేదిక‌గా కామెంట్ చేశాడు.. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని , కలిసి జీవించాల‌ని అనుకున్నామ‌ని.. చివరికి ఈ కఠిన నిర్ణయం వైపే మొగ్గు చూపామని తెలియ‌జేశాడు. అటు నటాషా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఇదే ప్రకటన చేసింది. విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు.నటాషా స్టాంకోవిచ్‌ తన కుమారుడు అగస్త్యను తీసుకుని బుధవారం (జూలై 17) ఉదయమే తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయింది. మొత్తానికి హార్ధిక్ పాండ్యాకి ఇలా దెబ్బ మీద దెబ్బ త‌గ‌ల‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.