IND vs NZ|డ‌కౌట్స్‌లో చెత్త రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా.. 46 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

IND vs NZ|మొన్నామ‌ధ్య బంగ్లాదేశ్‌పై బెబ్బులిలా గ‌ర్జించిన టీమిండియా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి వ‌చ్చే స‌రికి చ‌తికిల ప‌డింది. 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. బెం

  • By: sn    sports    Oct 17, 2024 1:43 PM IST
IND vs NZ|డ‌కౌట్స్‌లో చెత్త రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా.. 46 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

IND vs NZ|మొన్నామ‌ధ్య బంగ్లాదేశ్‌పై బెబ్బులిలా గ‌ర్జించిన టీమిండియా(India) న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి వ‌చ్చే స‌రికి చ‌తికిల ప‌డింది. 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఈ జట్టుకి శుభారంభం ల‌భించ‌లేదు. కేవ‌లం ముగ్గురు బౌల‌ర్స్ భార‌త జ‌ట్టుని కుప్ప‌కూల్చారు. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు చేసి టిమ్ సౌథీ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (0) కూడా సున్నాకే పెవిలియన్ బాట పట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ (0) కూడా సున్నాకే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఛాన్స్ ద‌క్కించుకున్న స‌ర్ఫ‌రాజ్ దారుణంగా నిరాశ‌ప‌రిచాడు.

యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్‌(Rishabh Pant)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నట్లు క‌నిపించిన 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు జైస్వాల్ . అనంతరం సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (0) , జ‌డేజా(0), అశ్విన్(0) కూడా డకౌట్ అయ్యారు. రిషబ్ పంత్ ట‌చ్ లో ఉన్న‌ట్టు క‌నిపించిన 20 ప‌రుగ‌ల‌కి ఔట‌య్యాడు. మొత్తం 7 వికెట్లలో ఐదుగురు జీరోకే పెవిలియన్ చేరడం గమనార్హం. సొంతగడ్డపై భారత టాప్-7 బ్యాటర్లలో నలుగురు డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి ఏడుగురు బ్యాటర్లలో నలుగురు ఖాతా తెరవకుండా వెనుదిరగడం ఇది మూడోసారి. అంతకుముందు 1952, 2014లో ఇంగ్లండ్‌(England)తో జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు సమర్పించుకున్నారు.1969లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 27 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

పిచ్ పేసర్లకి అనుకూలించడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ వ‌రుస‌గా పేస్ బౌల‌ర్స్‌తో బౌలింగ్ చేయించాడు. టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, విలియమ్‌తో మాత్రమే వరుసగా బౌలింగ్ చేయిస్తూ భారత్ బ్యాటర్లు ఎక్క‌డా కుదురుకునే అవ‌కాశం ఇవ్వ‌లేదు. న్యూజిలాండ్(New Zealand) టీమ్‌లో టిమ్ సౌథీ ఒక వికెట్ తీయగా.. మాట్ హెన్రీ 5 వికెట్లు, విలియమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ మొత్తం ఈ ముగ్గురూ తప్ప ఎవరూ బౌలింగ్ చేయలేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో, అంతక ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ న్యూజిలాండ్ అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూట‌గ‌ట్టుకున్న న్యూజిలాండ్ జ‌ట్టు బెంగ‌ళూరులో వీర‌విహారం చేస్తుంది.న్యూజిలాండ్ బౌలర్లు ఓవర్ వేస్తే వికెట్ అనేలా బౌలింగ్ చేయ‌గా, భార‌త బౌల‌ర్స్ మాత్రం వారిని ఏ మాత్రం ఇబ్బంది పెడుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.