AUS vs IND 1st T20 : భారత్ – ఆస్ట్రేలియా తొలి టీ 20 మ్యాచ్ రద్దు

వర్షం టీ20కి అడ్డం! కాన్‌బెర్రాలో భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు. గిల్, సూర్యకుమార్ జంట అజేయంగా నిలిచారు.

AUS vs IND 1st T20 : భారత్ – ఆస్ట్రేలియా తొలి టీ 20 మ్యాచ్ రద్దు

విధాత : భారత్ – ఆస్ట్రేలియా మధ్య కాన్ బెర్రా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ 20మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన అసీస్ కెప్టెన్ మార్ష్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 3.5ఓవర్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ(19, 4ఫోర్లు) తొలి వికెట్ గా ఔటయ్యాడు. అతను నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో టీమ్ డేవిడ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వర్షం రావడంతో ఆటను 18ఓవర్లకు కుదించారు. 9.4ఓవర్ల వద్ధ రెండోసారి వర్షంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. అప్పటికి భారత్ 97/1 స్కోర్ వద్ధ ఉంది. ఓపెనర్ గిల్ (37, 4ఫోర్లు, 1సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (39, 3ఫోర్లు, 2సిక్స్ లు) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రెండో వికెట్ కు వారిద్దరు 62పరుగులు జోడించారు. వర్షంతో తిరిగి ఆటను కొనసాగించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో రెండో టీ 20 ఈనెల 31 వ తేదీన మెల్ బోర్న్ లో జరుగనుంది.