Shubman Gill injury| గిల్ అవుట్..రెండో టెస్టుకు కెప్టెన్ గా రిషభ్ పంత్

టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఫిట్నెస్ టెస్ట్ లో విఫలమయ్యాడు. గిల్ గాయంతో జట్టు నుంచి వైదొలిగిన నేపథ్యంలో గౌహతి టెస్టులో వైస్ కెప్టెన్ రిషభ్‌పంత్‌ టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నాడు.

Shubman Gill injury| గిల్ అవుట్..రెండో టెస్టుకు కెప్టెన్ గా రిషభ్ పంత్

విధాత : టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill)ఫిట్నెస్ టెస్ట్ లో విఫలమయ్యడు. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గిల్‌ మెడనొప్పితో మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. గౌహతీ వేదికగా రేపు శనివారం నుంచి టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌(India vs South Africa 2nd Test) ప్రారంభం కానుంది. జట్టుతో పాటు గౌహతికి చేరుకున్న గిల్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఈ క్రమంలో మరోసారి గిల్ కు వైద్య పరీక్షలు నిర్వహించి అతను ఆటకు సిద్దంగా లేడని తేల్చారు. దీంతో అతన్ని జట్టు నుంచి రిలీజ్‌ చేశారు. వెంటనే గిల్ ముంబయికి పయనమయ్యాడు.

అతడు ముంబయిలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరోసారి వైద్యులను సంప్రదించనున్నాడు. మెరుగైన వైద్య సేవలు, ఫిట్నెస్ కోసం గిల్ ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు పంపిస్తారా లేదా అన్న విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ నుంచి స్పష్టత వెలువడలేదు. కెప్టెన్ గిల్ గాయంతో జట్టు నుంచి వైదొలిగిన నేపథ్యంలో గౌహతి టెస్టులో వైస్ కెప్టెన్ రిషభ్‌పంత్‌(Rishabh Pant captaincy) టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నాడు.