IND vs SL|సిరీస్ గెలుచుకున్న టీమిండియా.. ఇక గంభీర్- సూర్యల జోరుకి బ్రేకులు ఉండ‌వా..!

IND vs SL| ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న టీమిండియా ఆ త‌ర్వాత జింబాబ్వే టూర్‌కి వెళ్లింది. అక్క‌డ సిరీస్ ద‌క్కించుకొని స్వదేశంలో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత శ్రీలంక గ‌డ్డ‌పై అడుగుపెట్టి ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ట్రోఫీ ద‌క్కించుకుంది. తొలి టీ20లో మంచి విజ‌యం సాధించిన టీమిండియా రెండో టీ20లోను విజ‌యం

  • By: sn    sports    Jul 29, 2024 7:19 AM IST
IND vs SL|సిరీస్ గెలుచుకున్న టీమిండియా.. ఇక గంభీర్- సూర్యల జోరుకి బ్రేకులు ఉండ‌వా..!

IND vs SL| ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న టీమిండియా ఆ త‌ర్వాత జింబాబ్వే టూర్‌కి వెళ్లింది. అక్క‌డ సిరీస్ ద‌క్కించుకొని స్వదేశంలో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత శ్రీలంక గ‌డ్డ‌పై అడుగుపెట్టి ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ట్రోఫీ ద‌క్కించుకుంది. తొలి టీ20లో మంచి విజ‌యం సాధించిన టీమిండియా రెండో టీ20లోను విజ‌యం సాధించింది. భారత టీ20 రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన సిరీస్‍లో ఆట‌గాళ్లు అంద‌రు అద్భుతంగా ప్ర‌ద‌ర్శన క‌నబ‌రిచి టీమ్‌కి మంచి విజ‌యం ద‌క్కేలా చేశారు. ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‍గా బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్‍నే టీమిండియా కైవసం చేసుకోవ‌డం విశేషం. అయితే పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వర్షం వల్ల డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లకు 78 పరుగుల లక్ష్యం రాగా.. 6.3 ఓవర్లలోనే టీమిండియా ఛేదించేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆయ‌న నిర్ణ‌యం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. బ్యాటింగ్‌కి వ‌చ్చిన శ్రీలంక జ‌ట్టుకి మంచి ఆరంభం ల‌భించిన కూడా మిడిలార్డ‌ర్ ఘోరంగా విఫ‌లం కావ‌డంతో 161 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కుషాల్ పెరీరా (34 బంతుల్లో 53 పరుగులు) అర్ధ శకతంతో అదరగొట్టాడు. పాతుమ్ నిస్సంక (32) మోస్త‌రు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ద‌శ‌లో 3 వికెట్లకు 130 పరుగులతో ఉండ‌గా, చివరి ఐదు ఓవర్లలో కేవలం 31 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది లంక. కాగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా 2-2 వికెట్లు తీశారు.

ఇక భార‌త బ్యాటింగ్ వర్షం వల్ల ఆలస్యంగా సాగింది. టీమిండియా లక్ష్యఛేదనకు దిగాక మళ్లీ వాన ప‌డ‌డంతో భార‌త‌ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ విధానంలో 8 ఓవర్లకు 78 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. ఈ క్ర‌మంలో 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి గెలిచింది టీమిండియా. . ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ హిట్టింగ్‍తో అద‌ర‌గొట్ట‌గా, సంజూ శాంసన్ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26 పరుగులు) తన మార్క్ విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, ఓ సిక్స్) చివరి వరకు నిలిచి భార‌త్ ఖాతాలో విజ‌యం చేరేలా చేశాడు.