అఫ్గానిస్థాన్‌తో టెస్టు, వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్లను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టార్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది.
వన్డేజట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లీ, రాహుల్, ఇషాన్, పాండ్య, నితీశ్, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ప్రిన్స్ యాదవ్, బ్రార్, హర్ష్ దుబే.
టెస్టు: గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), జైస్వాల్, సాయి సుదర్శన్, పంత్, పడిక్కల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, మానవ్ సుతార్, బ్రార్, హర్ష్, జురేల్.
మ్యాచ్‌ల షెడ్యూల్..
జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)
తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)
రెండో వన్డే : జూన్ 17 (లక్నో)
మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)
ఇవి కూడా చదవండి :
తెలంగాణ ఐఏఎస్ లు ముగ్గురికి జాతీయ పురస్కారాలు
బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని ఛేదించే క్లూ దొరికిందా? అమెరికా శాస్త్రవేత్తల కీలక అధ్యయనం..
