India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ టార్గెట్ 124 రన్స్

కోల్ కతా వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా మూడవ రోజున 153పరుగులకే అలౌటైంది. దీంతో విజయానికి భారత్‌ జట్టు 124 పరుగుల స్వల్ప లక్ష్యం చేధించాల్సి ఉంది

India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ టార్గెట్ 124 రన్స్

విధాత : కోల్ కతా వేదికగా భారత్ (India)తో జరుగుతున్న తొలి టెస్టు(First Test) రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా(South Africa)మూడవ రోజున 153పరుగులకే అలౌటైంది. దీంతో విజయానికి భారత్‌ జట్టు 124 పరుగుల స్వల్ప లక్ష్యం చేధించాల్సి ఉంది. సఫారీల రెండో ఇన్నింగ్స్ లో అత్యధికంగా కెప్టెన్ బవుమా (55*), కోర్బిన్‌ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, కుల్‌దీప్‌ 2, సిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159, భారత్‌ 189 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో బూమ్రా 5వికెట్లతో రాణించాడు.

తొలి టెస్టులో 124పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశ పరిచాడు. యన్సెన్ బౌలింగ్ లో జైస్వాల్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం (1)పరుగకే యన్సెన్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. దీంతో టీమిండియ 6/1గా స్కోర్ తో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. క్రీజ్ లో (0), ద్రువ్ జురెల్(4) వాషింగ్టన్ సుందర్ (5)పరుగులతో ఆడుతున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.