India-Bangladesh 2nd test | టెస్ట్​మ్యాచ్​లో భారత్​ టి20 మోత – రికార్డులే రికార్డులు

భారత్​, బంగ్లాదేశ్​ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్​ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో భారత్​ టి20 తరహాలో బ్యాటింగ్​ చేసింది. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా నమోదు చేసింది.

India-Bangladesh 2nd test | టెస్ట్​మ్యాచ్​లో భారత్​ టి20 మోత – రికార్డులే రికార్డులు

మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్​–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్​మ్యాచ్​లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్​ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్​ కాగా, భారత్​ తమ తొలి ఇన్నింగ్స్​ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్​(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు చేసారు. భారత్​ తమ మొదటి ఇన్నింగ్స్​ను 34.4 ఓవర్ల వద్ద 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్​ ( 285/9 Dec in 34.4 overs)చేసింది. మొత్తంగా 8.22 రన్​ రేట్​తో భారత్​ ఈ టెస్ట్ ఇన్నింగ్స్​ ఆడింది. ఈ క్రమంలో ఇండియా నమోదు చేసిన రికార్డులను చూద్దాం.

టెస్ట్​ మ్యాచ్​లో అత్యతం వేగవంతమైన 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్​ రికార్డు నెలకొల్పింది. ఇవన్నీ కూడా ఒకే మ్యాచ్​లో, ఒకే ఇన్నింగ్స్​లో నమోదవడం గమనార్హం.

1. భారత ఓపెనింగ్​ జోడీ తొలి వికెట్​కు 55 పరుగులు జోడించింది. 50 పరుగులు కేవలం మూడు ఓవర్లలో రావడం విశేషం. ఇది టెస్ట్​ మ్యాచ్​లో ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ(Fastest Fifty in Test Matches). ఇంతకుముందు ఇంగ్లండ్​, వెస్టిండీస్​పై 4.2 ఓవర్లలో చేసింది. రన్​రేట్​ 16.6

2. అంతర్జాతీయ మ్యాచ్​లలో (అన్ని ఫార్మాట్​లలో కలిపి) 20 బంతుల లోపు 50 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. అంతకుముందు 22 బంతుల్లో ఇదే బంగ్లాపై టి20 మ్యాచ్​లో 50 చేసింది. 50 Runs in below 20 balls

3. ఈ ఏడాది ఆడిన 8 టెస్ట్​ మ్యాచ్​లలో భారత్​ కొట్టిన సిక్స్​లు 90. ఒక క్యాలెండర్​ ఏడాదిలో ఇన్ని సిక్స్​లు ఇంతవరకు ఏ జట్టు కొట్టలేదు. ఇంగ్లండ్​ రెండోస్థానంలో 89 సిక్స్​లతో ఉంది. (90 Sixers in 8 test matches.

4. తానెదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్​లుగా మలవడం ఇది నాలుగోసారి. రోహిత్​ ఈ ఫీట్​ సాధించాడు. మొత్తంగా మూడుసార్లూ భారతే కొట్టగా, ఒకసారి వెస్టిండీస్​ 1942లో సాధించింది. భారత్​ తరపున సచిన్​, ఉమేశ్​ యాదవ్​ మిగతా ఇద్దరు. 2 Sixes of 1st two balls faced by Rohit.

5. ఒక టెస్ట్​ మ్యాచ్​లో అత్యంత వేగవంతమైన 100 పరుగుల రికార్డు ఈ మ్యాచ్​లో భారత్​ నమోదు చేసింది. 100 పరుగులకు 10.1 ఓవర్లు, 61 బంతులు అవసరమయ్యాయి. Fastest 100 in a Test.

6. ఒక టెస్ట్​ మ్యాచ్​లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డు ఈ మ్యాచ్​లో భారత్​ నమోదు చేసింది. 150 పరుగులకు 18.12 ఓవర్లు, 112 బంతులు తీసుకున్నారు. Fastest 150 in a Test.

7. ఒక టెస్ట్​ మ్యాచ్​లో అత్యంత వేగవంతమైన 200 పరుగుల రికార్డు ఈ మ్యాచ్​లో భారత్​ నమోదు చేసింది. 200 పరుగులు 24.2 ఓవర్లు, 148 బంతులలో చేసింది. Fastest 200 in a Test.

8. ఇదే మ్యాచ్​లో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్న బౌలర్​గా అవతరించాడు. 3000లకు పైగా పరుగులు, 300 వికెట్లు సాధించిన 11వ ఆల్​రౌండర్​​, భారత్​ తరపున మూడో ఆటగాడు. ముందున్నది కపిల్​దేవ్​, అశ్విన్​. 300 Wickets – 3000 Runs for Jadeja