IPL 2025 | ఐపీఎల్‌ వేలానికి ముందు ఆటగాళ్లు రిలీజ్‌ చేయనున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో రోహిత్‌ సహా ఐదుగురు స్టార్స్‌..!

IPL 2025 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) మెగావేలం త్వరలో జరుగనున్నది. ఈ దీనికి ముందు ఫ్రాంచైజీలు స్టార్‌ ఆటగాళ్లను వదులుకోబోతున్నాయి. ప్రముఖంగా ఐదుగురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎంత మందిని గరిష్ఠంగా మందిని నిపులుపుకోవచ్చ..? వేలం మార్గదర్శకాలపై బీసీసీఐ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

IPL 2025 | ఐపీఎల్‌ వేలానికి ముందు ఆటగాళ్లు రిలీజ్‌ చేయనున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్‌లో రోహిత్‌ సహా ఐదుగురు స్టార్స్‌..!

IPL 2025 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) మెగావేలం త్వరలో జరుగనున్నది. ఈ దీనికి ముందు ఫ్రాంచైజీలు స్టార్‌ ఆటగాళ్లను వదులుకోబోతున్నాయి. ప్రముఖంగా ఐదుగురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎంత మందిని గరిష్ఠంగా మందిని నిపులుపుకోవచ్చ..? వేలం మార్గదర్శకాలపై బీసీసీఐ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఫ్రాంచైజీలు మాత్రం దాదాపు అన్ని జట్లు విడుదల చేయాల్సిన, అంటిపెట్టుకోవాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంఎస్‌ ధోనిని కొనసాగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌తో సహా గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతిస్తుందని టాక్‌. అయితే, ఎనిమిది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పలు జట్లు డిమాండ్‌ చేస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌లో మెగా వేలంతో జట్టు మొత్తం మారిపోతుంది. గత వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఈ సారి వేలానికి ముందు రిటైన్‌ ఆటగాళ్లను సంఖ్యను నిర్ణయించలేదు. ఫ్రాంచైజీ ఐదారు మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునేందుకు అనుమతి ఇస్తే చాలామంది టాప్‌ ఆటగాళ్లను విడుదల చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి స్టార్స్‌ ఎవరో చూసేద్దాం రండి..!

రోహిత్‌ను వదులుకోనున్న ముంబయి

ఈ సారి మెగా వేలంలో రోహిత్‌ శర్మ మెగావేలానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. గత ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పించింది. గుజరాత్‌ జట్టు నుంచి హార్దిక్‌ పాండ్యాను తీసుకొని జట్టు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ముంబయి జట్టు యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలుసార్లు ముంబయిని విజేతగా నిలిపిన రోహిత్‌ని ముంబయి ఇండియన్స్‌ అవమానించిందని అభిమానులు మండిపడ్డారు. అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడుతూ ఎంఐతో 2024 తనకు చివరి సీజన్‌ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ఈ ఊహాగానాలే బలం చేకూరుస్తున్నాయి. రోహిత్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వేలం పూల్‌లోకి వస్తే ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశాలున్నాయి.

కేఎల్ రాహుల్ తప్పించాలని భావిస్తున్న లక్నో..

లక్నో సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ని తీసుకోవాలని యోచిస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ని విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. వ్యక్తిగతంగా రాణించలేకపోవడం, కెప్టెన్‌గానూ మెప్పించలేకపోయాడు. దాంతో రిటైన్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. వాస్తవానికి టీమిండియా టీ20 జట్టులోనూ కేఎల్‌ రాహుల్‌ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోవచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సారి లక్నో జట్టుకు ఆడాలని కేఎల్‌ రాహుల్‌ ఆసక్తి చూపిస్తున్నాడు. ఇందులో భాగంగా ఓనర్‌ గొయెంకాను కలిశాడు. అయితే, రిటైన్‌ చేసుకునే విషయంలో హామీ ఇవ్వలేదని తెలుస్తున్నది. 2024లో మెంటార్‌గా గంభీర్ వైదొలిగిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్‌సీబీ నుంచి ఫాఫ్ డు ప్లెసిస్ అవుట్‌..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గత సీజన్‌లో ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. జట్టును కూడా ఆశించిన మేర నడిపించలేకపోయాడు. వయసు కూడా 40 ఏళ్లు పైబడడంతో టీ20 ఫార్మాట్‌లో అతడి అత్యుత్తమ కాలం ముగిసిపోయినట్లేనని విశేష్లకులు పేర్కొంటున్నారు. ఇక పటిష్టమైన జట్టు కూర్పు నేపథ్యంలో ఆర్‌సీబీ కొత్త సారథిని కూడా నియమించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఫాఫ్ డుప్లెసిస్‌ను వదులుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

వెంకటేశ్‌ అయ్యర్ కేకేఆర్‌ వేటు..

మెగా వేలానికి ముందు రీటైన్‌, నిలుపుకోవాల్సిన ఆటగాళ్ల విషయంలో సందిగ్ధంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఉన్నది. కేవలం ఐదు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రీటైన్‌ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో జట్టుకు తలనొప్పిగా మారింది. స్టార్‌ ప్లేయర్స్‌ అయిన సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రస్సెల్‌, రింకూ సింగ్‌, మిచెల్ స్టార్క్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌కి ప్రాధాన్యం ఇస్తే వెంకటేశ్‌ అయ్యర్‌కు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉన్నది. దాదాపు అతన్ని వదులునుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గత సంవత్సరం జట్టును ఛాంపియన్‌గా చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆల్ రౌండర్ పాత్రపోషించాడు. వెంకటేశ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయగడు. అతన్ని విడుదల చేస్తే వేలంలో ఫ్రాంచైజీలు మళ్లీ పోటీపడే ఛాన్స్‌ ఉన్నది.

గ్లెన్ మాక్స్‌వెల్..

ఆర్‌సీబీలో స్టార్‌ ప్లేయర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. గత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ ప్రదర్శన పేలవంగా ఉన్నది. గత వేలంలో ఆర్‌సీబీ ఏకంగా రూ.14.25కోట్లు దక్కించుకున్నది ఆర్‌బీఐ. చెత్త ప్రదర్శనతో జట్టును ఆదుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీఐ అతన్ని వదులుకునేందుకు అవకాశం ఉన్నది. ఇదే జరిగితే వేలంలో మరేదైనా జట్టు దక్కించుకునే అవకాశం ఉన్నది. అయితే, గతంలో మాదిరిగా ఈ సారి వేలంలో అంత మొత్తం ఖర్చు చేసేందుకు అవకాశం లేదు. వాస్తవానికి గత టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మ్యాక్స్‌వెల్‌ని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఈ సారి విడుదల చేసి అదే మొత్తంలో పలువురు స్టార్స్‌ని కొనుగోలు చేయాలని ఆర్‌సీబీ భావిస్తున్నది.