Kamran Akmal | బీసీసీఐని చూసి నేర్చుకోవాలి.. పీసీబీకి మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ చురకలు..!

Kamran Akmal | పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ (Kamran Akmal) మండిపడ్డాడు. ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలో బీసీసీఐ (BCCI)ని చూసి నేర్చుకోవాలని పీసీబీ (PCB)కి సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచులపై టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కివి జట్టు పాక్‌ పర్యటనకు వచ్చి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడింది.

Kamran Akmal | బీసీసీఐని చూసి నేర్చుకోవాలి.. పీసీబీకి మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ చురకలు..!

Kamran Akmal | పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ (Kamran Akmal) మండిపడ్డాడు. ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలో బీసీసీఐ (BCCI)ని చూసి నేర్చుకోవాలని పీసీబీ (PCB)కి సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచులపై టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కివి జట్టు పాక్‌ పర్యటనకు వచ్చి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆడింది. అయితే, ఆతిథ్య జట్టు దాన్ని డ్రాగా మాత్రమే అందుకోగలిగింది. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ 2024లో అమెరికా కొత్త జట్టు నుంచి పాక్‌ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నది. టీమిండియా చేతిలో పాక్‌ ఓటమి మూటగట్టుకున్నది. భారతదేశం కూడా వారిని ఓడించింది. ఈ టోర్నీలో బాబర్ అజామ్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ చేతిలో స్వదేశంలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా పాక్ బోర్డుపై మాజీ క్రికెటర్‌ క్రమాన్‌ అక్మల్‌ పీసీబీపై విమర్శలు గుప్పించాడు. పాలకుల దురహంకారంతోనే బోర్డు ఈ దుస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అక్మల్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ బీసీసీఐ నుంచి ప్రొఫెషనలిజం, జట్టు, సెలెక్టర్లు, కెప్టెన్‌, కోచ్‌ నుంచి నేర్చుకోవాల్సింది పీసీబీ ఎంతో ఉందని చెప్పాడు. ఇవే జట్టును నెంబర్‌ వన్‌గా నిలబెట్టి ప్రపంచాన్ని శాసించేవని.. మనం ఇలా బాగుంటే పాక్‌ క్రికెట్‌ ఇలా ఉండేది కాదని.. దురహంకారానికి పాక్‌ క్రికెట్‌ నష్టపోతుందని చెప్పాడు. అంతకు ముందు టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాలను ప్రశంసించారు. బంగ్లాదేశ్‌పై ఇద్దరు రాణించడంతో జట్టు గెలుపొందింది. కమ్రాన్ మాట్లాడుతూ అశ్విన్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడని.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి సెంచరీ సాధించాడని ప్రశంసించాడు. జడేజాతో కలిసి అశ్విన్ మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని ప్రశంసించాడు. అలాగే, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత టెస్ట్ జట్టులో బలమైన పునరాగమనం చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను కూడా అక్మల్ ప్రశంసించాడు. పంత్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతన్ని తిరిగి మైదానంలోకి తీసుకురావడంలో విజయం సాధించిన వైద్య బృందానికి, ట్రైనర్లకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పాడు.