LSG vs KKR| సునైల్ న‌రైన్ విధ్యంసానికి భారీ స్కోరు చేసిన కేకేఆర్.. చేతులెత్తేసిన ల‌క్నో

LSG vs KKR| పీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చెల‌రేగిపోతుంది.జ‌ట్టులోని ఆట‌గాళ్లు క‌లిసి ఆడుతుండ‌డంతో అద్భుత విజ‌యాలు ద‌క్కుతున్నాయి. తాజాగా సూపర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏకంగా 98 ప‌రుగులు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో ఇంత భారీ తేడాతో ఎ

  • By: sn    sports    May 06, 2024 6:42 AM IST
LSG vs KKR| సునైల్ న‌రైన్ విధ్యంసానికి భారీ స్కోరు చేసిన కేకేఆర్.. చేతులెత్తేసిన ల‌క్నో

LSG vs KKR| పీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చెల‌రేగిపోతుంది.జ‌ట్టులోని ఆట‌గాళ్లు క‌లిసి ఆడుతుండ‌డంతో అద్భుత విజ‌యాలు ద‌క్కుతున్నాయి. తాజాగా సూపర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏకంగా 98 ప‌రుగులు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో ఇంత భారీ తేడాతో ఎప్పుడు ఓట‌మి చెందింది లేదు. ఈ విజ‌యంతో కేకేఆర్ 16 పాయింట్లు సాధించి దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ సంపాదించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించ‌గా,.. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), రఘు వంశీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) జ‌ట్టుకి విలువైన ప‌రుగులు చేశారు. అయితే ల‌క్నో బౌల‌ర్స్‌లో నవీన్ ఉల్ హక్(3/49) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌కి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులక‌ కుప్పకూలి ఘోర పరాజయం చ‌విచూసారు. జ‌ట్టులో కేఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినీస్(36) కాస్త విలువైన పరుగులు చేశారు. మిగ‌తా వారంతా దారుణంగా విఫ‌లం అయ్యారు. ల‌క్నోకి మొద‌ట్లోనే అర్షిన్ కులకర్ణి(9) రూపంలో పెద్ద షాక్ త‌గిలింది.ఇక త‌ర్వాత వ‌చ్చిన మార్కస్ స్టోయినీస్‌తో కలిసి రాహుల్ ఆచితూచి ఆడాడు. వీరిద్ద‌రు సూప‌ర్ ఇన్నింగ్స్ తో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే నిలకడగా ఆడుతున్న రాహుల్‌ను హర్షిత్ రాణా పెవీలియ‌న్‌కి పంపిచాడు.

దీంతో రాహుల్‌, స్టోయినింగ్ 50 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఇక కొద్ది సేప‌టికి స్టోయినిస్ కూడా ఔట‌య్యాడు. దీంతో ల‌క్నో ఆశ‌లు అడుగంటాయి. ల‌క్నో బ్యాటింగ్ లైన‌ప్ అంతా పేకమేడలా కుప్పకూలింది. దీపక్ హుడా(5), నికోలస్ పూరన్(10), ఆయుష్ బోని(15), అష్టన్ టర్నర్(16), కృనాల్ పాండ్యా(5), యద్వీర్ సింగ్(7), రవి బిష్ణోయ్(2) వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. క‌నీసం రెండు వంద‌ల ప‌రుగుల మార్క్ కూడా వారు చేరుకోలేక‌పోయారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ ఇద్ద‌రు అద్భుతంగా బౌలింగ్ చేసి మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఆండ్రీ రస్సెల్‌కు ఓ వికెట్ దక్కింది.