Neeraj Chopra | ఫైనల్స్ లోకి నీరజ్ చోప్రా..బంగారు పతకంపై ఆశలు
పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫైయర్ రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా ఫైనల్స్ లో అర్హత సాధించాడు
విధాత, హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన క్వాలిఫైయర్ రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా ఫైనల్స్ లో అర్హత సాధించాడు. కాగా ఈనెల 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా ఫైనల్ కు చేరుకోలేకపోయాడు. అత్యుత్తమంగా తొలి ప్రయత్నంలో 80.73 మీటర్ల ప్రదర్శన చేశాడు.
రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 80.21 మీటర్లు విసిరాడు. అతడు ఫైనల్‌కు అర్హత సాదించాలంటే ఇతరుల పలితాలపై ఆధారపడి ఉంది. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే 84 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరాల్సివుంది. ఈ ఒలంపిక్స్‌లో భారత్ ఖాతాలో ఇప్పటిదాక కేవలం షూటింగ్‌లో సాధించిన మూడు కాంస్య పతకాలే ఉండగా, బంగారు పతకం కల నీరజ్ చోప్రా తీరుస్తారని భారత్ అభిమానులు గట్టి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram