T20 World Cup|మళ్లీ సౌతాఫ్రికాకి నిరాశే.. మహిళల వరల్డ్ కప్ దక్కించుకున్న న్యూజిలాండ్
T20 World Cup|కొద్ది రోజులుగా యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఎట్టకేలకి ముగిసింది. ఆస్ట్రేలియా ఈ సారి రేసులో లేకపోవడంతో ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి అందరిలో ఉండేది. ఆ సస్పెన్స్‌కి తెర దించుతూ సోఫీ డివైన్ సారథ్యంలోని న్యూజిలాండ్ తొలిసారి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అక్టోబర్ 20 ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణా
T20 World Cup|కొద్ది రోజులుగా యూఏఈ(UAE) వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఎట్టకేలకి ముగిసింది. ఆస్ట్రేలియా(Australia) ఈ సారి రేసులో లేకపోవడంతో ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి అందరిలో ఉండేది. ఆ సస్పెన్స్‌కి తెర దించుతూ సోఫీ డివైన్ సారథ్యంలోని న్యూజిలాండ్ తొలిసారి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అక్టోబర్ 20 ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా(South Africa)ను ఓడించి 15 ఏళ్ల నిరీక్షణకి తెరదించింది. టీ20 లేదా వన్డేల్లో ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా న్యూజిలాండ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకముందు సీనియర్ పురుషులు లేదా మహిళల క్రికెట్‌లోను న్యూజిలాండ్ జట్టు ఏ వరల్డ్ కప్ అందుకోలేకపోయింది.

మొత్తానికి సోఫీ అండ్ టీం సరికొత్త చరిత్ర సృష్టించారు అని చెప్పాలి. మరోవైపు ఎన్నో ఏళ్ల నుండి దక్షిణాఫ్రికా పురుషుల జట్టు, మహిళల జట్టు వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాని వారికి ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. మెన్స్ టీ20 వరల్డ్ కప్(T20 world cup) ఫైనల్‌లో చేతిదాకా వచ్చిన మ్యాచ్‌ని సౌతాఫ్రికా చేజార్చుకోవడం మనం చూశాం. ఇక వరుసగా రెండో ఏడాది ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓటమి బాట పట్టడంతో ఈ సారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడే అవకాశం కోల్పోయింది. . కివీస్ టీ20 ప్రపంచకప్‌ను సాధించడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కాని దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే అక్టోబరు 20 ఆదివారం న్యూజిలాండ్(New Zealand) క్రికెట్‌కు చాలా స్పెషల్ అని చెప్పాలి. దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలిసారిగా న్యూజిలాండ్ పురుషుల జట్టు భారత్‌లో టెస్టు మ్యాచ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బెంగళూరు టెస్టులో టామ్ లాథమ్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందుంజలో ఉంది. ఇటు పురుషుల జట్టు, అటు మహిళల జట్టు ఒకే రోజు కూడా సరికొత్త చరిత్ర సృష్టించి ఆ దేశ ప్రజలకి ఎనలేని ఆనందాన్ని అందించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram