ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై పాక్ తొలి విజయం
విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో […]

విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో రాణించారు. కాగా, తాజా విజయంతో ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై పాక్ తొలిసారి ఆధిపత్యం సాధించినట్లు అయింది.