Rahul Dravid| జాబ్ ఆఫర్స్ ఉంటే చెప్పండంటూ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర కామెంట్స్
Rahul Dravid| 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంతో ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆశలు లేని స్థితి నుంచి గొప్పగా పోరాడి ఫైనల్‌లో దక్షిణా

Rahul Dravid| 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంతో ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆశలు లేని స్థితి నుంచి గొప్పగా పోరాడి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది . ఫైనల్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు గుడ్‌బై చెప్పారు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ పదవికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆటగాడిగా ప్రపంచకప్‌ని అందుకోలేకపోయిన ద్రావిడ్ కోచ్‌గా ఆ కలని నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో కన్నీటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
అయితే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇక నుండి పై తాను నిరుద్యోగిని అని, ఏమైనా జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలంటూ సరదాగా మాట్లాడాడు.2021 నవంబర్‌లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. గత వన్డే వరల్డ్ కప్‌కే వీడ్కోలు పలకాల్సింది. కాని ఈ టీ20 ప్రపంచకప్ వరకు కోచ్‌గా ఉండాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ కొనసాగాడు. అయితే తాను కోచ్‌గా ఉన్నప్పుడు వరల్డ్ కప్ టీమిండియాకి దక్కడంతో చాలా సంతోషంగా న్నాడు. కఠిన పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన ఈ జట్టు పట్ల గర్వపడుతున్నానని అన్నాడు.. ఆటగాడిగా నేనెంతో కష్టపడినా ట్రోఫీని అందుకోలేకపోయా. 2007లో పరాభవానికి ఇది ఊరటగా నేను భావించట్లేదు, టీమిండియాతో నా ప్రయాణం అద్భుతంగా సాగిందని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ద్రావిడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముగించాడు. అయితే ఆయన ప్రయాణం ముగియడంతో నిరుద్యోగిగా మారిపోతున్నా. ఏమైనా ఆఫర్లు ఉంటే చెప్పండి అని సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇక ద్రవిడ్ హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పడంతో భారత ఆటగాళ్లు అందరు ఎమోషనల్ అయ్యారు. ద్రవిడ్‌ను ఎత్తుకొని జైకొట్టారు. ఘనంగా ఫేర్‌వెల్ ఇచ్చారు.