Rishbh Pant|పంత్ బ్యాటింగ్ చేస్తాడా లేదంటే ఆయన స్థానంలో జురెల్ ఆడతాడా..!
Rishbh Pant|వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌లో ఛాన్స్ దక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్ట్ ఆడుతుండగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయి అందరిచేత విమర్శలు అందుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్
Rishbh Pant|వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్‌లో ఛాన్స్ దక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.బెంగళూరు(Bangalore) వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్ట్ ఆడుతుండగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయి అందరిచేత విమర్శలు అందుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తక్కువ పరుగులకే ఔట్ అయిన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఓటమి కోరల్లో నుంచి బయటపడగలమనే ఆశలను అభిమానులకు కల్పించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకి ఔట్ కాగా, న్యూజిలాండ్ 402 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ భారీ లీడింగ్ సాధించింది.

ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ మూడు వికెట్స్ కోల్పోయి 231 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(35), రోహిత్ శర్మ (52) పరుగులు , విరాట్ కోహ్లీ( 70 ) చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(70 ) ఉన్నారు. అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ మోకాలి గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్ సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా లేదా అని అందరిలో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే మూడో రోజు రెండో సెషన్ అనంతరం విరామ సమయంలో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే పంత్ మునపటిలా చాలా సౌకర్యవంతంగా కనిపించడం లేదు. బ్యాటింగ్‌కు తన మోకాలు సహకరిస్తుందో లేదో అని పరిశీలిస్తున్నాడు.
నిదానంగా సాధన చేస్తున్న పంత్ బ్యాటింగ్ చేసిన కూడా పరుగులు తీయడం కాస్త కష్టం అని చెప్పాలి. కేవలం ఫోర్స్, సిక్సర్లపైనే పంత్ ఆధారపడతాడని అంటున్నారు. రానున్న రోజులలలో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో పంత్‌తో బీసీసీఐ రిస్క్ చేస్తుందా లేదా అనేది చూడాలి.కాగా, గురువారం రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 37వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతి నేరుగా పంత్ మోకాలికి తాకింది. ఆ తర్వాత పంత్ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మూడో రోజు కూడా ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పంత్ అదే మోకాలికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram