Sanju Samson vs Rishabh Pant | రిషబ్ పంత్ Vs సంజూ శాంసన్..! తుది జట్టులో ఛాన్స్ ఎవరికి..?
Sanju Samson vs Rishabh Pant | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. హెడ్‌కోచ్‌రాహుల్‌ద్రవిడ్‌పర్యవేక్షణలో శ్రమిస్తున్నది. ఈసారి ఎలాగైన కప్‌కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలో మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్‌కమిటీ ప్రకటించింది. అలాగే, పలువురిని రిజర్వ్‌ప్లేయర్లుగా ఎంపిక చేసింది.

Sanju Samson vs Rishabh Pant | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. హెడ్‌కోచ్‌రాహుల్‌ద్రవిడ్‌పర్యవేక్షణలో శ్రమిస్తున్నది. ఈసారి ఎలాగైన కప్‌కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలో మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్‌కమిటీ ప్రకటించింది. అలాగే, పలువురిని రిజర్వ్‌ప్లేయర్లుగా ఎంపిక చేసింది. అయితే, మెగా టోర్నీకి ఇద్దరు వికెట్‌కీపర్లు ఎంపికయ్యారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో కెప్లెను కావడం విశేషం. రిషబ్‌పంత్, సంజూ శాంసన్‌టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. గత రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి.. భారత జట్టుకు దూరమైన రిషబ్‌పంత్‌ఐపీఎల్‌లో రాణించాడు. మళ్లీ టీ20 వరల్డ్‌కప్‌తో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఐపీఎల్‌లో ఆకట్టుకున్న రిషబ్‌పంత్
రిషబ్‌పంత్2022, డిసెంబర్30న జరిగిర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకున్న రిషబ్‌పంత్.. దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్‌సీజన్‌తో మళ్లీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించాడు. ఐపీఎల్‌సీజన్‌లో కెప్టెన్‌గా 13 మ్యాచులు ఆడిన పంత్.. 40.55 సగటుతో 446 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్‌సెంచరీలు సైతం ఉన్నాయి. వికెట్‌కీపర్‌గా 11 క్యాచులు పట్టడంతో పాటు 5 స్టంప్‌అవుట్స్‌చేశాడు.
అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్‌కు పిలుపు..
ఐపీఎల్‌రాయస్థాన్‌రాయల్స్‌కెప్టెన్‌సంజూ శాంసన్‌అద్భుతంగా రాణించడంతో టీమిండియా నుంచి పిలుపును అందుకున్నాడు. నిలకడగా ఆడుతూ 15 మ్యాచుల్లో 531 పరుగులు సాధించాడు. నాయకుడిగానూ రాణించి జట్టును క్వాలిఫైయర్‌వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో రిషబ్‌పంత్, సంజూ శాంసన్ ఇద్దరు టీ20 ఎంపిక కాగా.. ఇద్దరు వికెట్‌కీపర్లు కావడం మరో విశేషం. అయితే, ఇద్దరిలో తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనే చర్చనీయాంశంగా మారింది. అయితే, టీ20 రికార్డులు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం రిషబ్‌పంత్‌కు ఉన్నది. అదే సమయంలో లెఫ్ట్‌హ్యాండర్‌బ్యాటర్‌కావడంతో పంత్‌కు ఎక్కువ ఛాన్స్‌ఉన్నది. అదే సమయంలో క్షణాల్లోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నది. అదే సమయంలో సంజూ శాంసన్‌ఆకాశమే హద్దుగా బౌలర్లపై బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తుంటాడు.
పంత్‌వైపే మొగ్గు..
టీ20 వరల్డ్‌కప్‌లో రిషబ్‌పంత్‌కే తుది జట్టులో ఛాన్స్ లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టాప్‌లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌చేస్తూ వస్తుంటాడు. అయితే, శాంసన్‌కు విరాట్‌కోహ్లీ, సూర్య కుమార్‌యాదవ్‌నుంచి పోటీ తీవ్రంగా ఉన్నది. సూర్య కుమార్‌యాదవ్‌కు ఏమైనా ఫిట్‌నెస్‌సమస్యలు ఉంటే రిషబ్‌తో పాటు సంజూ శాంసన్ ఇద్దరూ తుది జట్టులో ఛాన్స్‌ఉండే అవకాశం ఉంది. లేకపోతే లెఫ్ట్‌రైట్‌కాంబినేషనల్‌లో రిషబ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయి.