Rohit Sharma: 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని ఘనత సాధించిన రోహిత్..ఒకే ఒక్కడు హిట్‌మ్యాన్
Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్ పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. బౌలర్ ఎలాంటి వాడయిన బంతిని డైరెక్ట్‌గా స్టాండ్స్‌లో పడేసే సత్తా రోహిత్‌కి ఉంది. ప్రస్తుం టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఈ సారి తన కెప్టెన్సీలో జట్టుకి వరల్డ్ కప్ అందించాలని కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం విండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా, తొలి టెస్ట్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్ట్‌పై కూడా పట్టు బిగించింది. […]

Rohit Sharma:
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్ పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. బౌలర్ ఎలాంటి వాడయిన బంతిని డైరెక్ట్‌గా స్టాండ్స్‌లో పడేసే సత్తా రోహిత్‌కి ఉంది. ప్రస్తుం టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఈ సారి తన కెప్టెన్సీలో జట్టుకి వరల్డ్ కప్ అందించాలని కృషి చేస్తున్నాడు.
ప్రస్తుతం విండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా, తొలి టెస్ట్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్ట్‌పై కూడా పట్టు బిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.ఇక చివరి రోజు ఆ జట్టు 289 పరుగులు చేస్తే గెలుస్తుంది. మరోవైపు భారత జట్టు ఎనిమిది వికెట్స్ తీస్తే మరో విజయం భారత్ ఖాతాలో చేరుతుంది.
అయితే తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ-యశస్వి జైశ్వాల్ జోడి అసలైన బజ్ బాల్ ఆట ఆడి హడలెత్తించారు. కేవలం 35 బంతుల్లోనే రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేయగా, ఆయనకు టెస్టుల్లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఈ నేపథ్యంలోనే వరుసగా 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు రోహిత్. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ మహేల జయవర్ధనే (29 ఇన్నింగ్స్‌లో డబుల్ డిజిట్ స్కోర్) పేరిట ఉండగా, ఇప్పుడు ఆ రికార్డ్ రోహిత్ చెరిపేశాడు.
రోహిత్ తన చివరి 30 టెస్ట్ ఇన్నింగ్స్ చూస్తే.. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులుగా ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ రెండంకెల స్కోర్ సాధించిన టెస్ట్ ప్లేయర్‌గా అగ్రస్థానంలో ఉంగా, జయవర్ధనే (29సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు.
లెన్ హట్టన్(25), రోహన్ కన్హాయ్(25), ఏబీ డీవిల్లియర్స్(24) తర్వాతి స్థానాల్లో నిలిచారు. హిట్ మ్యాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ యావరేజ్ 53.64గా ఉంది. 2018 వరకు టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ సరిపోడనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అతడే జట్టులో బెస్ట్ టెస్ట్ బ్యాటర్ కావడం గమనార్హం.