అభిమానుల నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన వాంఖ‌డే..గేలి చేయ‌డం ఆపాలంటూ పాండ్యాకి అండ‌గా రోహిత్

ఈ సారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కొత్త కెప్టెన్‌తో బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఎప్పుడైతే పాండ్యా కొత్త కెప్టెన్‌గా ఎంపిక కాబ‌డ్డాడో అప్ప‌టి నుండి ఆయ‌న‌పై దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ముంబై ఇండియన్స్ యాజ‌మాన్యంతో పాటు కెప్టెన్‌పై కూడా దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముంబై ఇండియ‌న్స్ ఆడుతున్న ప్ర‌తి మ్యాచ్‌లో కూడా హార్ధిక్ ఏం చేసిన కూడా గట్టిగా అరుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ చేసే తప్పిదాలను భూతద్దంలో చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్ర‌మంలో పాండ్యాకి అండ‌గా నిలిచారు రోహిత్.

తాజాగా ఆర్ఆర్‌, ముంబై మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ అభిమానులు వాంఖడే స్టేడియం ముంగిట నానా హంగామా సృష్టించారు.. ‘కింగ్ ఆఫ్ ముంబై’, ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. మ‌రోవైపు మైదానంలో హార్ధిక్‌ని అవ‌మాన‌ప‌రిచేలా విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో రోహిత్ క‌ల‌గ‌జేసుకున్నాడు .ఎగతాళి చేయడం ఆపి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డ్ చేస్తున్న రోహిత్ శర్మ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌తో ఫీల్డ్ సెటప్ గురించి మాట్లాడుతున్న స‌మ‌యంలో .. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు.

ఆకస్మాత్తుగా తన సమీపింగా రావడంతో రోహిత్ శర్మ గజ్జున వణికాడు. అయితే చివ‌రికి అత‌నికి హ‌గ్ ఇచ్చి పంపించాడు. ఆ అభిమాని పక్కనే ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కి కూడా హ‌గ్ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్‌లతో 32) కొంత మేర ప‌రుగులు చేశారు.. ట్రెంట్ బౌల్ట్(3/22), యుజ్వేంద్ర చాహల్(3/11) ముంబై పతనాన్ని శాసించారు. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీసారు. ఇక ఆర్ఆర్ జ‌ట్టు 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రియాన్‌ పరాగ్‌ (54) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఆ జ‌ట్టు సుల‌భంగా గెలిచింది. ఇక టోర్నీలో హార్దిక్ సేనుకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా, రాజస్థాన్ కు హ్యాట్రిక్ గెలుపు.