గెలిచే మ్యాచ్‌లో గుజ‌రాత్ ఓటమి.. ఒకే ఒక్క‌డు మ్యాచ్‌ని మ‌లుపుతిప్పేశాడుగా..!

గెలిచే మ్యాచ్‌లో గుజ‌రాత్ ఓటమి.. ఒకే ఒక్క‌డు మ్యాచ్‌ని మ‌లుపుతిప్పేశాడుగా..!

ఈ సీజ‌న్‌లో ఏ జ‌ట్టు విజేత‌గా నిలుస్తుంద‌ని చెప్ప‌డం కాస్త క‌ష్టంగానే ఉంది.గుజరాత్, పంజాబ్ మ‌ధ్య గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో జీటీనే గెలుస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని శశాంక్ సింగ్(29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్‌కు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.లక్ష్య ఛేదనలో 111 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్ తిరిగి పుంజుకొని మంచి విజ‌యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్(48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) మంచి నాక్ ఆడ‌గా.. సాయి సుదర్శన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 33), రాహుల్ తెవాటియా(8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించ‌డంతో గుజ‌రాత్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కి గాను 199 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా రెండు వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్ జ‌ట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. చాలా మంది కూడా ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ భారీ విజ‌యాన్ని అందుకుంటుంద‌ని అనుకున్నారు. కాని వారి ఆశ‌ల‌పై ఒకే ఒక్క‌డు నీళ్లు పాశాడు. అశుతోష్ శర్మతో కలిసి శ‌శంక్ శ‌ర్మ సంచలన బ్యాటింగ్ చేసి పంజాబ్‌కి మంచి విజ‌యాన్ని అందించాడు. ఏడో వికెట్‌కి ఈ ఇద్ద‌రు కూడా విలువైన 43 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు . అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31, 3 ఫోర్లు, ఒక సిక్స్) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది రెండో విజయం. ఇక గుజ‌రాత్‌కి ఇది రెండో ప‌రాజ‌యం.

గెల‌వాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓట‌మి చెంద‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. చెత్త ఫీల్డింగ్‌తో పాటు మోహిత్ శర్మ 19వ ఓవర్ ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ ఓవర్‌లో మోహిత్ శర్మ 18 పరుగులివ్వడంతో పంజాబ్ సునాయాసంగా విజ‌యం సాధించింది. గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 2, మోహిత్‌ 1, ఉమేశ్‌ యాదవ్‌ 1, ఒమర్జాయ్‌ 1, రషీద్‌ ఖాన్‌ 1, దర్శన్‌ 1 వికెట్‌ తీశారు.