Sourav Ganguly|సౌర‌వ్ గంగూలీ కూతురు ఎంత పెద్ద‌గైందో తెలుసా? ఆమె ఏడాది జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

Sourav Ganguly| భారత లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫైరింగ్ కెప్టెన్‌గా గంగూలీ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్నాడు. ఆయ‌న ఆట‌గాడిగా కూడా అద‌ర‌గొట్టాడు. అయితే త్వ‌ర‌లోనే గంగూలీ జీవిత క‌థ వెండితెర‌పై ఆవిష్కృతం కానుండ‌గా, ఇప్పుడు గం

  • By: sn    sports    Aug 29, 2024 8:55 AM IST
Sourav Ganguly|సౌర‌వ్ గంగూలీ కూతురు ఎంత పెద్ద‌గైందో తెలుసా? ఆమె ఏడాది జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

Sourav Ganguly| భారత లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫైరింగ్ కెప్టెన్‌గా గంగూలీ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్నాడు. ఆయ‌న ఆట‌గాడిగా కూడా అద‌ర‌గొట్టాడు. అయితే త్వ‌ర‌లోనే గంగూలీ జీవిత క‌థ వెండితెర‌పై ఆవిష్కృతం కానుండ‌గా, ఇప్పుడు గంగూలీ గురించి ప‌లు విష‌యాలు తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. సౌరవ్ గంగూలీకి 22 ఏళ్ల కూతురు సనా గంగూలీ ఉన్న విషయం తెలుసా? ఈ మధ్యే కోల్‌కతా డాక్టర్ రేప్ ఘటన నేపథ్యంలో ఒక్క ఘటనతో వెస్ట్ బెంగాల్, ఇండియా మహిళలకు సురక్షితం కాదు అని వివాదాస్పద కామెంట్స్ గంగూలీ చేసిన నేపథ్యంలో అతని కూతురు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది.

ఓ కూతురికి తండ్రిగా ఈ ఘటనను తనను షాక్ కు గురి చేసిందని కూడా గంగూలీ అప్పట్లో అన్నాడు. అయితే స‌నా గంగూలీ ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఈ క్ర‌మంలో స‌నా వార్షిక ఆదాయంకి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 22 ఏళ్ల సనా అమెరికాలోని ఇనోవెరోవ్ లో కన్సల్టెంట్ గా ఉద్యోగం సంపాదించింది. ఇక అమెరికాలో ఒక కన్సల్టెంట్ వార్షిక వేతనం కనీసం 49,647 డాలర్లు అని గ్లాస్ డోర్ వెబ్ సైట్ చెబుతోంది. ఈ లెక్క‌న చూసుకుంటే సనా గంగూలీ వార్షిక ఆదాయం కనీసం రూ.55 లక్షలు ఉంటుందని అంచనా. ఇక సనా అంతకుముందు యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి బీఎస్సీ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేట్ అయింది.

సౌరవ్, డోనా దంపతులకు సనా ఒక్కగానొక్క కూతురు కాగా ఆమెని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 2001లో జన్మించిన సనా చదువుతో పాటు తల్లి వద్ద నృత్య శిక్షణ కూడా తీసుకుంది. సనా 12వ తరగతి వరకు కోల్ కతాలో చదువుకోగా, ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది.ప్ర‌స్తుతం బాగానే సంపాదిస్తున్న స‌నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఆమెకి రాబోయే వాడు ఎంత కోటీశ్వ‌రుడు అయి ఉంటాడో అని కూడా కొంద‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు.