Sunil Gavaskar|గంభీర్ సూప‌ర్ కోచింగ్.. టీమిండియా వ‌రుస ప‌రాజాయాలు.. గ‌వాస్క‌ర్ సెటైర్స్

Sunil Gavaskar|టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన‌ప్ప‌టి నుండి భార‌త జ‌ట్టు వ‌రుస ప‌రాజ‌యాల‌ని ఎదుర్కొంటుంది. వ‌న్డేలు, టెస్ట్‌లు ఇలా ప్ర‌తీది ఓడిపోతూ విమ‌ర్శ‌లు అందుకుంటుంది. హెడ్ కోచ్‌గా గంభీర బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలోనే భారత్‌ రెండు ఘోర పరాజయాలు

  • By: sn    sports    Nov 06, 2024 9:35 AM IST
Sunil Gavaskar|గంభీర్ సూప‌ర్ కోచింగ్.. టీమిండియా వ‌రుస ప‌రాజాయాలు.. గ‌వాస్క‌ర్ సెటైర్స్

Sunil Gavaskar|టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన‌ప్ప‌టి నుండి భార‌త జ‌ట్టు వ‌రుస ప‌రాజ‌యాల‌ని ఎదుర్కొంటుంది. వ‌న్డేలు, టెస్ట్‌లు ఇలా ప్ర‌తీది ఓడిపోతూ విమ‌ర్శ‌లు అందుకుంటుంది. హెడ్ కోచ్‌గా గంభీర బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలోనే భారత్‌ రెండు ఘోర పరాజయాలు మూట గట్టుకోవ‌డంతో ఆయ‌న ప‌నితీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్ పర్యవేక్షణలో మొద‌ట శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్‌ కోల్పోయింది. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీలంక చేతిలో ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోవ‌డం ఎవ‌రికి మింగుడుపడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ దానిని లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్ట్, టీ20 సిరీస్ గెలిచినా.. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్‌కు గురవ్వడం ఇదే తొలిసారి.ఇంత చెత్త‌గా భార‌త్ ఆడినందుకు ప‌లువురు క్రికెటర్స్ భార‌త ఆట‌గాళ్ల‌తో పాటు గంభీర్, రోహిత్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే ప‌రాజ‌యం త‌ర్వాత గంభీర్ పనితీరుపై గవాస్కర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘భారత కోచింగ్ టీమ్‌ గురించి జట్టు సాధించిన ఫలితాలే మాట్లాడుతాయి. శ్రీలంకలో సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురై ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఫలితాలే వారి పని తీరును చెబుతున్నాయనుకుంటున్నా. ఈ పరాజయాలకు టీమిండియా మేనేజ్‌మెంట్ బాధ్యత తీసుకోవాలి అని గ‌వాస్క‌ర్ అన్నారు.

ప్ర‌తి జ‌ట్టుకి సంబంధించిన విష‌యంలో కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ నిర్ణ‌యం ఆధార‌పడి ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి జట్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వర్కౌట్ కాకపోతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కూడా వేటు పడుతోంది. బ్యాటింగ్‌లో సత్తా చాటకపోతే ఈ సీనియర్ ఆటగాళ్లను కూడా పక్కనపెట్టి కుర్రాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్‌కు పంపిస్తారు అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.మరోవైపు బీసీసీఐ అధికారులు ఇండియా క‌నుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే రోహిత్, కోహ్లీల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేసే అవ‌కాశం ఉంది. ‘భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే జట్టుకు సీనియ‌ర్స్ ఎంపికవ్వరు. అదే జరిగితే నలుగురు సీనియర్లు సొంతగడ్డపై చివరి టెస్ట్ ఆడినట్లే అని ఓ బీసీసీఐ అధికారి తెలియ‌జేశారు.