IPL|ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్ మాయ‌మైన‌ట్టేనా.. గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయంటే..!

IPL|  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్ 17 దాదాపు స‌గం పూర్త‌యింది. మ‌రి కొన్ని మ్యాచ్‌లు మాత్ర‌మే మిగిలి ఉండ‌గా, ఏ జ‌ట్టు ప్లే ఆఫ్‌కి వెళుతుంది, ఏ జట్టు ఫినాలేకి చేరుతుంది, ఏ జ‌ట్టు క‌ప్ అందుకుంటుంది అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వాటితో పాటు ఈ ఐపీఎల్‌లో

  • By: sn    sports    Apr 21, 2024 12:02 PM IST
IPL|ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్ మాయ‌మైన‌ట్టేనా.. గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయంటే..!

IPL|  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్ 17 దాదాపు స‌గం పూర్త‌యింది. మ‌రి కొన్ని మ్యాచ్‌లు మాత్ర‌మే మిగిలి ఉండ‌గా, ఏ జ‌ట్టు ప్లే ఆఫ్‌కి వెళుతుంది, ఏ జట్టు ఫినాలేకి చేరుతుంది, ఏ జ‌ట్టు క‌ప్ అందుకుంటుంది అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వాటితో పాటు ఈ ఐపీఎల్‌లో జ‌రుగుతున్న కొన్ని విష‌యాలు కూడా నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ సీజ‌న్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పగా, గుజరాత్ టైటాన్స్ (89 పరుగులు) తొలిసారి 100 కంటే తక్కువ పరుగులకే ఆలౌటైంది.అలానే కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు సుల‌వువ‌గా చేధించి స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పింది.

సూప‌ర్ ఓవ‌ర్ ఇక ఉండ‌న‌ట్టేనా?

ఇక ఈ సీజ‌న్‌లో ఏ మ్యాచ్ కూడా సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్ల‌లేదు. టీ20లలో అడ‌పాద‌డ‌పా సూప‌ర్ ఓవ‌ర్ చూస్తూ ఉంటాం. కాని ఐపీఎల్‌లో సూపర్‌ ఓవర్‌ మ్యాచ్ జరిగి మూడేళ్లు పూర్తయింది. ఐపీఎల్‌లో చివరిసారిగా 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య సూపర్‌ ఓవర్ జ‌రిగింది.ఆ త‌ర్వాత ఏ ఒక్క మ్యాచ్ కూడా టై కాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 215కి పైగా మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా, సూప‌ర్ ఓవ‌ర్ అనేది రాలేదు. ఆరు బంత‌లు మ్యాచ్ ఎంత ఉత్కంఠ‌గా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాని అలాంటి సంఘ‌ట‌న రాక మూడేళ్లు అవుతుంది.

ఐపీఎల్ 2024 ప్రథమార్ధం ముగిసినప్పటికీ, సూపర్ ఫైట్ అనేది క‌నిపించ‌లేదు. ఈ సూప‌ర్ ఓవర్‌ పోటీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడు సీజన్లుగా ఈ ఎదురుచూపులు న‌డుస్తుండ‌గా, అది ఎప్పుడు జ‌రుగుతుందా అని క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీజ‌న్‌లో ఎక్క‌వ ప‌రుగులు చేసిన కూడా వాటిని చేధించేందుకు ప్ర‌త్య‌ర్ధులు కూడా భారీగానే
ప‌రుగులు చేశారు కాని సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు ఎవరు తీసుకురాలేదు. సెకండాఫ్‌లో అది పక్కాగా జ‌రుగుతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. చూడాలి మ‌రి ఈ సీజ‌న్‌లో అయిన ప్రేక్ష‌కుల కోరిక నెర‌వేరుతుందా లేదా అనేది.