టీ-20 భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

2024 టీ -20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు యూఎస్ఏ, క‌రేబియ‌న్ సంయుక్తంగా ఆథిద్య‌మిస్తున్నాయి. అయితే ఈ సారీ భార‌త జెట్టులో ఎవ‌రు ఉంటార‌న్న విష‌యం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది

టీ-20 భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

విధాత‌: 2024 టీ -20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు యూఎస్ఏ, క‌రేబియ‌న్ సంయుక్తంగా ఆథిద్య‌మిస్తున్నాయి. అయితే ఈ సారీ భార‌త జెట్టులో ఎవ‌రు ఉంటార‌న్న విష‌యం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టు స‌భ్యుల‌ను మంగ‌ళ వారం ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మను కేప్ట‌న్‌గా అవ‌కాశ‌మిస్తూ, వైస్ కేప్ట‌న్‌గా హార్ధిక్ పాండ్య‌ను నియ‌మించింది. అయితే ఈ సారి కేఎల్ రాహుల్‌, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు టీంలో స్థానం ల‌భించ‌లేదు.

భార‌త జ‌ట్టు స‌భ్యులు వీరే: రోహిత్ శ‌ర్మ‌, య‌శస్వీ జైశ్వాల్‌, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్‌, సంజూ శ్యామ్‌స‌న్‌, రిష‌భ్ పంత్‌, హార్దిక్ పాండ్య‌, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ పటేల్‌, కుల్దీప్ యాద‌వ్‌, యూజివేంద్ర చాహ‌ల్‌, హ‌ర్ష‌దీప్ సింగ్‌, బుమ్రా, సిరాజ్‌

రిజ‌ర్వ్ ప్లేయ‌ర్స్‌: శుభ‌మ‌న్ గిల్‌, రింకూ సింగ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌