T20 World Cup 2024| ఇవి రెండు జరిగితే కనుక టీమిండియాకి వరల్డ్ కప్ టోర్నీ దక్కనట్టే..!
T20 World Cup 2024| టీ20 వరల్డ్ కప్ సమరం మరి కొద్ది రోజులలో ముగియనుంది. సెమీస్‌కి వెళ్లే జట్టు దాదాపు కన్‌ఫాం అయ్యాయి. ఈ రోజు సౌతాఫ్రికా.. వెస్టిండీస్‌పై గెలుపొందడంతో గ్రూప్2లో ఇంగ్లండ్‌తో పాటు దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకున్నాయి.ఇక మరి కొద్ది గంటలలో మొదలు కానున్న మ్యాచ్

T20 World Cup 2024| టీ20 వరల్డ్ కప్ సమరం మరి కొద్ది రోజులలో ముగియనుంది. సెమీస్‌కి వెళ్లే జట్టు దాదాపు కన్‌ఫాం అయ్యాయి. ఈ రోజు సౌతాఫ్రికా.. వెస్టిండీస్‌పై గెలుపొందడంతో గ్రూప్2లో ఇంగ్లండ్‌తో పాటు దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకున్నాయి.ఇక మరి కొద్ది గంటలలో మొదలు కానున్న మ్యాచ్‌తో గ్రూప్-ఏలో ఏయే జట్టు సెమీ ఫైనల్ బెర్త్‌లు కన్‌ఫాం చేసుకుంటాయో తెలిసిపోతుంది. అయితే తాజా గణాంకాలని బట్టి చూస్తుంటే సెమీస్‌లో టీమిండియాతో ఇంగ్లండ్ తలపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా గెలిస్తే.. గ్రూప్‌లో టాప్ టీంగా సెమీస్‌లోకి ఎంటర్ అవుతుంది భారత జట్టు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైన కూడా టాప్‌లో భారత్ నిలుస్తుంది.
దీంతో గ్రూప్-1లోని అగ్రశ్రేణి జట్టు అయిన భారత్ , గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలబడుతుంది. జూన్ 27న జరిగే 2వ సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడడం దాదాపు ఖాయమైంది అని చెప్పాలి. అయితే ఈ రెండు జట్లు తలపడితే భారత్‌కి బ్యాడ్ సెంటిమెంట్ భయం పట్టుకుంది. టోర్నీ నుండి ఔట్ కావడం ఖాయం అంటున్నారు. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడగా, ఈ మ్యాచ్ ఆసీస్‌లోని ఆడిలైడ్ వేదికగా జరిగింది. అది రెండవ సెమీ ఫైనల్ కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయగా, లక్ష్యాన్ని 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సునాసయంగా చేధించింది ఇంగ్లండ్ జట్టు . ఇందులో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్.
ప్రస్తుతం బట్లర్ మంచి ఫామ్‌లో ఉండగా, అతను కనుక టీమీండియాపై ఊచకోత ఇన్నింగ్స్ ఆడితే రోహిత్ సేన ఇంటికి పోవడం ఖాయం. ఇక మరో బ్యాడ్ సెంటిమెంట్ ఏంటంటే.. 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నింటిలో విజయం సాధించంది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఇప్పుడు కూడా అదే చేసి భారత్ అభిమానులని నిరాశపరుస్తారా, లేదంటే సెమీస్‌లో గెలిచి ఫైనల్ కి వెళ్లి అప్పుడు కూడా అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకి మరో కప్ తెచ్చి పెడతారా అనేది చూడాలి.