T20 World Cup 2024| వెస్టిండీస్ ఊచ‌కోత‌.. కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఛేజ్..!

T20 World Cup 2024| ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూపర్ 8 న‌డుస్తుంది. నువ్వా నేనా అన్న‌ట్టుగా అన్ని జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే సూపర్ 8లో ఓడిన విండీస్ జ‌ట్టు బార్బడోస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సా

  • By: sn    sports    Jun 22, 2024 11:04 AM IST
T20 World Cup 2024| వెస్టిండీస్ ఊచ‌కోత‌.. కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఛేజ్..!

T20 World Cup 2024| ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూపర్ 8 న‌డుస్తుంది. నువ్వా నేనా అన్న‌ట్టుగా అన్ని జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే సూపర్ 8లో ఓడిన విండీస్ జ‌ట్టు బార్బడోస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓటమితో జరిగిన నష్టాన్ని ఈ మ్యాచ్‌తో సరిచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన యునైటెడ్ స్టేట్స్ 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (29; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) మాత్ర‌మే టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓపెనర్ స్టీవన్ టేలర్ (2; 7 బంతుల్లో)ను రెండో ఓవర్‌లో రసెల్ ఔట్ చేయ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన నితీశ్ కుమార్ (20; 19 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి ఆండ్రీస్ గౌస్ ఇన్సింగ్స్ పున‌ర్నిర్మించే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే రోస్టన్ ఛేజ్ ధాటికి 51/1తో ఉన్న అమెరికా 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల‌లో ప‌డింది. మిలింద్ కుమార్ (19; 21 బంతుల్లో, 1 ఫోర్), షాడ్లీ (18; 17 బంతుల్లో, 3 ఫోర్లు) కాసేపు ప్ర‌తిఘ‌టించే ప్ర‌య‌త్నం చేసిన వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/19, రసెల్ (3/31) చెరో మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ (2/31) రెండు వికెట్స్ తీసి 128 ప‌రుగుల‌కి ఆలౌట్ చేశారు. ఇక 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో విండీస్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన సౌతాఫ్రికా ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది.

వెస్టిండీస్ బ్యాట‌ర్స్‌లో ఓపెనర్ షాయ్ హోప్ వీర‌విహారం చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ 17, నికోల్ పూరన్ పరుగులు చేశారు. మూడు వికెట్స్ తీసుకున్న రోస్టర్ చేజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ అందుకున్నాడు.