ఎండలు బాబోయ్ ఎండలు…జూ పార్కుల్లో వన్యప్రాణుల విలవిల

తీవ్రమైన ఎండల నుండి జంతువులను రక్షించేందుకు వన్యప్రాణుల కోసం దేశంలోని జూ పార్కులలో భారీ కూలర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. చల్లదనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఎండల ధాటికి మనుషులతో పాటు పశు పక్ష్యాదులు, వన్యప్రాణులు సైతం విలవిలలాడిపోతున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నీడపట్టున, కొండలు, నదులు, సెలయేళ్లలో సంచరిస్తూ జీవించే వన్యప్రాణులు జూపార్కులలో పరిమిత భూభాగంలో జీవించడంలో ఇబ్బందిపడటం సహజమే. అందులోనూ ఎండకాలంలో ఎండల వేడి తీవ్రతకు తాళలేక తల్లడిల్లుపోతు నీరసించిపోతుంటాయి. అందుకే దేశంలోని జూపార్కులలో వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు జూ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

తీవ్రమైన ఎండ నుండి జంతువులను రక్షించేందుకు జైపూర్‌లోని నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో అటవీ శాఖ ప్రత్యేక చర్యలను అమలు చేస్తుంది. వన్యప్రాణుల కోసం పార్కు అంతటా భారీ కూలర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. అలాగే వాటి ఆహార విధానంలోనూ మార్పులు చేశారు. వాటికి చల్లదనం కోసం ప్రత్యేక షెడ్ లు, నీటి వసతులు కల్పించారు. ఇదే పద్ధతిలో హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లోని జూపార్కులలో వన్యప్రాణుల సంరక్షణకు జూ సిబ్బంది చల్లదనంలో కూడిన చర్యలు అమలు చేస్తుండటం గమనార్హం.

 

ఇవి కూడా చదవండి :

వామ్మో ‘ఘోస్ట్ సైకిల్’…చూస్తే షాకింగ్ !
Viral Video | హోట‌ల్‌లో మూడు రోజులు బ‌స‌.. ట‌వ‌ల్స్, స్పూన్స్‌ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో

Latest News