Train horns | ఆడ‌వాళ్ల మాట‌ల‌కే కాదండోయ్‌.. రైలు బండి కూత‌ల‌కూ అర్థాలు వేరేన‌ట‌ తెలుసా..?

Train horns : 'ఆడ‌వారి మాట‌ల‌కూ.. అర్థాలే వేరులే..! అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే..!' అని ప‌వ‌న్‌కళ్యాణ్ సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాట‌లో చెప్పిన‌ట్లుగా ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలు వేరో.. కాదో.. తెలియ‌దుగానీ రైలు బండి కూత‌లకు ( Train horns ) మాత్రం అర్థాలు వేరేన‌ట‌. రైల్వే గార్డులను, సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు, హెచ్చరించేందుకు రైలు హారన్‌ల‌ను మోగిస్తుంటారు. ఇలా మొత్తం 11 రకాల హార‌న్‌లు ఉన్నాయ‌ట‌. అందులో ఒక్కో ర‌కం హారన్‌కు ఒక్కో అర్థం ఉంద‌ట‌. మరి ఆ రైలు కూత‌ల అర్థాలేమిటో మ‌నం కూడా తెలుసుకుందామా..?

Train horns | ఆడ‌వాళ్ల మాట‌ల‌కే కాదండోయ్‌.. రైలు బండి కూత‌ల‌కూ అర్థాలు వేరేన‌ట‌ తెలుసా..?

Train horns : ‘ఆడ‌వారి మాట‌ల‌కూ.. అర్థాలే వేరులే..! అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే..!’ అని ప‌వ‌న్‌కళ్యాణ్ సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాట‌లో చెప్పిన‌ట్లుగా ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలు వేరో.. కాదో.. తెలియ‌దుగానీ రైలు బండి కూత‌లకు ( Train horns ) మాత్రం అర్థాలు వేరేన‌ట‌. రైల్వే గార్డులను, సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు, హెచ్చరించేందుకు రైలు హారన్‌ల‌ను మోగిస్తుంటారు. ఇలా మొత్తం 11 రకాల హార‌న్‌లు ఉన్నాయ‌ట‌. అందులో ఒక్కో ర‌కం హారన్‌కు ఒక్కో అర్థం ఉంద‌ట‌. మరి ఆ రైలు కూత‌ల అర్థాలేమిటో మ‌నం కూడా తెలుసుకుందామా..?

ఏ హార‌న్‌కు ఏమ‌ని అర్థం..?

  • ఒక చిన్న హారన్ : లోకో పైలట్ ఒక చిన్న హారన్ సౌండ్ చేస్తే రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తీసుకెళ్తున్నట్టు అర్థమ‌ట‌.
  • రెండు చిన్న హారన్‌లు : రెండు చిన్న హారన్‌ల శబ్దం వినిపిస్తే రైలు బయల్దేరడానికి సిగ్నల్ ఇవ్వాల్సిందిగా గార్డును లోకో పైలట్ కోరుతున్నట్టు అర్థమ‌ట‌.
  • మూడు చిన్న హారన్‌లు : మూడు చిన్న హారన్‌ల శబ్దం వినిపిస్తే మోటార్‌పైన తన కంట్రోల్ పోయిందని, వ్యాక్యూమ్ బ్రేక్ వేయాలని గార్డుకు లోకోపైలట్ సమాచారం ఇస్తున్నట్టట‌. ఈ హారన్ అత్యంత అరుదుగా అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌.
  • నాలుగు చిన్న హారన్‌లు : రైలులో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే లోకోపైలట్ నాలుగు సార్లు చిన్న హారన్‌లు మోగిస్తాడ‌ట‌. అంటే రైలు ముందుకు కదలడానికి సిద్ధంగా లేదని అర్థమ‌ట‌.
  • ఒక లాంగ్ హార‌న్‌, ఒక షార్ట్ హారన్ : రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికన్నా ముందు బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయాలని గార్డుకు సిగ్నల్ ఇచ్చేందుకు లోకోపైలట్ ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్ ఇస్తారట‌.
  • రెండు లాంగ్ హార‌న్‌లు, రెండు షార్ట్ హారన్‌లు : రైలు ఇంజిన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలని గార్డుకు సూచిస్తూ లోకోపైలట్ రెండు లాంగ్ హార‌న్‌లు, రెండు షార్ట్ హారన్‌లు ఇస్తారట‌.
  • నిరంతరాయంగా హారన్ : రైల్వే స్టేషన్‌లో హాల్ట్ లేనప్పుడు రైలు ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు లోకోపైలట్ నిరంతరాయంగా హారన్ మోగిస్తారట‌. నాన్‌స్టాప్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేష‌న్‌ల‌లోకి వచ్చినప్పుడు ఈ హారన్‌లు వినిపిస్తాయ‌ట‌.
  • రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు : రైలు రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో ప‌ట్టాలు దాటుతున్న వారిని అప్రమత్తం చేసేందుకు లోకోపైలట్ రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు మోగిస్తాడ‌ట‌.
  • రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హార‌న్‌లు : రైలు ట్రాక్ మారేప్పుడు లోకో పైలట్ రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హార‌న్‌లు మోగిస్తాడ‌ట‌.
  • రెండు షార్ట్ హార‌న్‌లు, ఒక లాంగ్ హారన్ : రైల్వే ప్యాసింజర్ చైను లాగినా, గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ లాగినా లోకోపైలట్ రెండు షార్ట్ హార‌న్‌లు, ఒక లాంగ్ హారన్ మోగిస్తాడ‌ట‌.
  • ఆరు షార్ట్ హారన్‌లు : రైలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకోపైలట్ ఆరు సార్లు షార్ట్ హారన్‌లు మోగిస్తాడ‌ట‌.