cute baby viral video | “మాస్టారూ.. మీ టికెట్ ఏదీ”? హృదయాలను హత్తుకున్న చిన్నారి వీడియో
ట్రైన్‌లో తల్లి సరదాగా అడిగిన “టికెట్ kaha hai?” ప్రశ్నకు చిరునవ్వులతో స్పందించిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ల హృదయాలను ఆహ్లాదంలో ముంచెత్తింది.

cute baby viral video | సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం మనసును హత్తుకుని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తాజాగా ట్రైన్‌లో ఒక చిన్నారితో తన తల్లి చేసిన సరదా సంభాషణ వీడియో ఇంటర్నెట్ను ఉల్లాసంలో ముంచేస్తోంది. పాపడు టికెట్ లేకుండా ట్రైన్‌లో పయనిస్తున్నట్లు సరదాగా అడిగిన తల్లికి బోసినవ్వులతో ఆ చిన్నారి నోట్లోంచి వచ్చిన కేరింతలు ఇప్పుడు నెటిజన్లకు హాయి గొలుపుతోంది.
అమాయకపు చిరునవ్వుతో మంత్రముగ్ధులను చేసిన పసికందు
ఒక ఎసీ కోచ్‌లో లోయర్ బెర్త్‌పై చల్లగా పడుకున్న చిన్నారి తన అమాయకపు హావభావాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఆ క్షణంలో తల్లి సరదాగా అడిగింది –
“మీ టికెట్ ఏదీ?”, ఇది నా సీటు.. మీ సీటెక్కడ?
అమ్మ ప్రశ్నలు విన్న బిడ్డ ఆనందంతో మురిసిపోయి చిలిపి నవ్వులు చిందించాడు. తన చిన్న కాళ్లతో ఆడుకుంటూ, సంతోషంతో కళ్లు మెరిపిస్తూ ప్రతిస్పందించాడు.
సరదా సంభాషణతో హాస్యభరిత వాతావరణం
అక్కడితో ఆగకుండా తల్లి ముద్దుగా అడిగింది –
“లేవండి, ఇది నా సీటు, అమ్మ ఎక్కడ కూర్చుంటారు, నాన్న ఎక్కడ కూర్చుంటారు?”
ఈ మాటలు విన్న బిడ్డ తన చిరునవ్వులతో, అమాయకపు కళ్లతో తల్లికి సమాధానం ఇస్తున్నట్టే కనిపించాడు. ఈ చిన్నారి అమాయకత్వం చూసి తల్లి కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. తల్లీ, బిడ్డీ మధ్య ఆ సరదా సంభాషణతో మొత్తం కోచ్‌లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. వీడియో చూడండి:
View this post on Instagram
నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో
వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు హృదయపూర్వకంగా స్పందించారు.
- “ఇంత అందమైన నవ్వు నేను చూడలేదు”
- “చిన్నారి నవ్వులు నిజంగా హృదయాన్ని కరిగించాయి”
- “The cutest passenger ever!”
అంటూ కామెంట్లు షేర్ చేశారు. మరికొందరు “He stole my heart” అంటూ చిన్నారిని ప్రశంసించారు.
ఈ వీడియో ఒక సాధారణ ప్రయాణాన్ని ప్రత్యేక అనుభూతిగా మార్చింది. తల్లీ–బిడ్డల బంధం ఎంత పవిత్రమో, అమాయకపు చిరునవ్వు ఎంత శక్తివంతమో మరోసారి అందరికీ గుర్తు చేసింది. ఈ చిన్నారి బోసినవ్వులు, తల్లి సరదా సంభాషణ కలిసిపోవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి మొహంలో ఆనందపు చిరునవ్వులు పూయిస్తోంది.