Sound of Clapping | చప్పట్లు కొడితే వచ్చే ధ్వని రహస్యం కనిపెట్టేశారు!

Sound of Clapping | మీరందరూ చప్పట్లు కొట్టాలి! ఎందుకంటే.. చప్పట్లు కొడితే ధ్వని ఎలా పుడుతుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు కనుగొన్నారు! చప్పట్లు కొడితే శబ్దం వస్తుందనేది అందరికీ తెలిసిందే. ఎవరినైనా అభినందించేందుకు చప్పట్టు కొడతాం. అదే ఎదైనా హాల్‌లో అనేక మంది కలిసి చప్పట్లు కొడితే.. ఆ ధ్వని ఎంతో వినసొంపుగా, ఉత్సాహాన్ని ఉరకలెత్తించలా కూడా ఉంటుంది. వేదికలపై ఎవరైనా మంచి విషయాన్ని చెప్పినా, స్ఫూర్తినిచ్చే మాట మాట్లడినా, లేదా ఎదైనా సినిమాలో, లేదా స్టేజ్‌పై నాటికలో అద్భుత సన్నివేశం వంటివి వచ్చినా సహజంగానే ప్రేక్షకులు తన్మయంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. సీసాలపై పెదవులు పెట్టి ఊదితే.. ఫ్లూటు తరహాలో శబ్దం వెలువడుతుంది. సరిగ్గా అదే పద్ధతిలో చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి హెల్మ్‌హోల్ట్జ్ రెసొనెన్స్ అని అధికారికంగా శాస్త్రీయ నామకరణం చేశారు.
రెండు చేతులు కలిసినప్పుడు చప్పట్లు అవుతాయి. అప్పుడు రెండు చేతుల మధ్య ఉన్న గాలి బయటకు వెళ్లే సమయంలో ఈ శబ్దం సృష్టించబడుతుంది. దీనికోసం చేసిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు బేబీ పౌడర్‌ను వాడారు. చప్పట్లు కొట్టినప్పుడు ఆ పౌడర్ గాలిలోకి విడుదల కావడాన్ని మ్యాప్ చేశారు. చప్పట్లకోసం చేతులను ఒక దగ్గరకు గట్టిగా ఆన్చినప్పుడు హెల్మ్‌హోల్ట్జ్ రెసొనెన్స్ గా మారుతుందని గుర్తించారు. దీనికోసం హైస్పీడ్ వీడియో క్యాప్చరింగ్‌ను ఒత్తిడి ప్రమాణాలను వినియోగించారు. తమ ప్రయోగం ఫలితాలను ఫిజికల్ రివ్యూ రిసెర్చ్‌లో పరిశోధకులు షేర్ చేసుకున్నారు.
‘ఎవరైనా వ్యక్తులు చప్పట్టు కొట్టినప్పుడు జెట్ వేగంతో గాలి ప్రవాహం చేతుల మధ్య ఉన్న ఖాళీ నుంచి బయటకు వస్తుంది. అది బొటనవేలు, చూపుడు వేలు మధ్య నుంచి ప్రయాణిస్తుంది. ఇలా బయటకు వచ్చే గాలి ప్రవాహం ఎనర్జీని కలిగి ఉంటుంది’ అని ఈ ప్రయోగంలో పాల్గొన్న ఈకాంగ్ ఫు తెలిపారు. అక్కడే ధ్వని తొలుత ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆ జెట్ వేగం గాలి కంపనాలను పుట్టిస్తుందని తెలిపారు. ఈకాంగ్ ఫు.. న్యూ యార్క్‌లోని ఇథాకాలో ఉన్న కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీర్. ఈ ప్రయోగంలో అతని బృందం అనేక రకాల చప్పట్లను అధ్యయనం చేసింది. చేతులు చదునుగా చేసి కొట్టడం, కప్ ఆకారంలో చేతులు మడిచి చప్పట్లు కొట్టడం, వేళ్లతో కొట్టడం వంటి పద్ధతులను పరిశీలించింది. ఇవన్నీ కూడా హెల్మ్‌హోల్ట్జ్ రెసొనెన్స్ తో మ్యాచ్ అయినట్టు తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధ్వనిగా ఉంటుందని హు అన్నారు. భవిష్యత్తులో వ్యక్తులను వారి చప్పట్ల ద్వారా గుర్తించేందుకూ వీలు కలుగుతుందని చెప్పారు. అంతేకాదు.. కొంత కాలానికి యూజర్‌లు తమ డివైస్‌లలో లాగిన్ అయ్యేందుకు కూడా ఈ చప్పట్లు పనికొస్తాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Warangal | యజమాని పేరుతో గుమస్తాకు టోకరా.. రూ.కోటి 68 లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థుడు అరెస్ట్
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?
Milk: ఎండాకాలంలో.. పాలు విరిగిపోకూడదంటే!
Smita Sabharwal: ట్రాన్స్‌ఫర్‌పై.. భగవద్గీత స్లోకంతో స్మిత సబర్వాల్ ట్వీట్!