Arattai | ఆరట్టై హీట్‌లో భారత్ – ఇండియన్ వాట్సాప్‌కు 75 లక్షల డౌన్లోడ్లు
జోహో రూపొందించిన ఆరట్టై యాప్ దేశీయ వాట్సాప్‌గా మారుతోంది. Pocket, Meetings, Mentions వంటి ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. డౌన్‌లోడ్ విధానం, ముఖ్య ఫీచర్లు ఇక్కడ చూడండి.

Zoho’s Arattai App Gains Popularity; Pocket, Meetings, No-AI Features Impress Users
చెన్నై, అక్టోబర్ 5 (విధాత):
భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో కార్పొరేషన్ రూపొందించిన “ఆరట్టై (Arattai)” యాప్ ఇప్పుడు సోషల్ మీడియా చర్చల్లో ఉంది. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్‌లకు పోటీగా వచ్చిన ఈ దేశీ మెసేజింగ్ యాప్ iOS, Android ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా డౌన్‌లోడ్ అవుతోంది. గోప్యత, సులభమైన డిజైన్, యాడ్స్ లేని అనుభవం కారణంగా వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. అదీ కాక, భారతీయ యాప్ కాబట్టి, మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్‌కు భారీ ఆదరణ దక్కుతోంది.
ఆరట్టై యాప్ ప్రత్యేకతలు – ఏమిటి? ఎలా?
ఆరట్టై యాప్ ద్వారా యూజర్లు మెసేజింగ్, వాయిస్ నోట్స్, వీడియో కాల్స్ చేయడంతో పాటు ఫొటోలు, డాక్యుమెంట్లు, స్టోరీస్ షేర్ చేయవచ్చు. కేవలం మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేయగలిగే ఈ యాప్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి:
1️⃣ Pocket (పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్):
ఇది యూజర్లకు వ్యక్తిగత స్టోరేజ్ లాగా పని చేస్తుంది. వాట్సాప్‌లా “సెల్ఫ్ చాట్ గ్రూప్” సృష్టించాల్సిన అవసరం లేకుండా, ఆరట్టైలో Pocket ఫీచర్ ద్వారా ముఖ్యమైన మెసేజ్‌లు, ఫొటోలు, నోట్లు సేవ్ చేసుకోవచ్చు.
2️⃣ Meetings ఫీచర్:
ఆరట్టైలోనే మీటింగ్‌లు సృష్టించడం, చేరడం, షెడ్యూల్ చేయడం సాధ్యమే. దీంతో Zoom లేదా Google Meet లాంటి యాప్‌లు అవసరం ఉండదు.
3️⃣ Mentions ట్యాబ్:
గ్రూప్ చాట్లలో ఎవరైనా మీ పేరు ట్యాగ్ చేస్తే, అవన్నీ “Mentions” ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఇది Slack మాదిరిగా పనిచేస్తూ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్సవకుండా చూస్తుంది.
4️⃣ No AI, No Ads:
Meta AI మాదిరిగా ఎటువంటి AI ఫీచర్లు లేవు. యూజర్ అనుభవాన్ని క్లీన్‌గా ఉంచడమే లక్ష్యం. అలాగే యాప్‌లో ఎటువంటి ప్రకటనలు (Ads) ఉండవు.
5️⃣ డేటా భద్రత:
ఆరట్టై యూజర్ డేటా మొత్తం భారతదేశంలోని డేటా సెంటర్లలోనే నిల్వవుంటుంది. వాయిస్, వీడియో కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్‌లో ఉంటాయి.
డౌన్‌లోడ్ ఎలా చేయాలి?
Android: Google Playలో Arattai Messenger (Zoho Corporation) అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. థర్డ్ పార్టీ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు.
iPhone: App Storeలో Arattai Messenger అని వెతికి, Developerగా “Zoho Corporation” అని చూసి “Get” క్లిక్ చేయాలి.
ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దేశం, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేయాలి. తర్వాత ప్రొఫైల్ పేరు, ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఒక్కో గ్రూప్‌లో గరిష్టంగా 1,000 మంది సభ్యులు ఉండవచ్చు. ఇది పెద్ద ఆఫీస్ టీములు, విద్యా సంస్థలు, కమ్యూనిటీలకు అనుకూలంగా ఉంటుంది.