నిరుత్సాహపడవద్దు…ప్రయత్నం ఆపవద్దు,గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై … సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
గ్రూప్-1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

విధాత, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. గ్రూప్ – 1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు నా శుభాకాంక్షలని, అక్టోబర్ 21 – 27 ‘మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్విటర్ వేదికగా పేర్కోన్నారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని, జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాని కోసం, ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ‘ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు తాజాగా విడుదల కావడంతో.. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను టీజీపీఎస్సీ సెలక్ట్ చేసినట్లు తెలిపింది. ఇక, గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం 1:50కు బదులుగా 1: 100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలన్న నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు.