బీసీ రిజర్వేషన్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి సీతక్క
గ్రామీణ స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్ ఆగస్ట్ 31(విధాత): గ్రామీణ స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. బీసీ రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి బంధువు అడ్డుకుంటున్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరో కోర్టు కి వెళితే సీఎంకు అంటగట్టడం ఏంటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను కుదించింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం చేసింది కానీ సాదించారా అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపునకు 10 సంవత్సరాలు పట్టిందన్నారు. 24 జనవరి 1980 లో బీసీ రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ.. సీఎం ఎం జీ రామచంద్రన్ నేత్రుత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే అది అమలు కావడానికి 10 ఏండ్లు పట్టిందని స్పష్టం చేశారు.
25 సెప్టెంబర్ 1991 లో పీవీ ప్రభుత్వం మైనారిటిలో ఉంది. జయలలిత తమిళనాడు సీఎం. అన్నా డి ఎం కే పీవీ ప్రభుత్వంలో భాగస్వామి. దీంతో ఆ రోజు పట్టుబట్టి రాజ్యంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారా అక్కడ రిజర్వేషన్లు 69 శాతం కి చేరాయని మంత్రి సీతక్క వెల్లడించారు. ఎవరు ప్రశ్నించకుండా రాజ్యంగంలో షెడ్యుల్ 9 లో చేర్చి ప్రొటెక్షన్ ఇచ్చారన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంతా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు.