Road accident | బులందర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్ బులందర్ (Bulandshahr) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆదివారం బులంద్‌షహర్ జిల్లాలో సేలంపుర్ ప్రాంతంలో బదాయూ - మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది.
27మందికి గాయాలు
Road accident | ఉత్తరప్రదేశ్ బులందర్ (Bulandshahr) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆదివారం బులంద్‌షహర్ జిల్లాలో సేలంపుర్ ప్రాంతంలో బదాయూ – మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ (Chandra Prakash Singh) తెలిపారు. మరో 27 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు. “పికప్ ట్రక్ ఘజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ సరైన రూట్లోనే వస్తుందని, బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని ప్రత్యక్ష సాక్షుల కథనం. రహదారిపై బస్సును ఒక్కసారిగా తిప్పడం వల్ల బస్సు ట్రక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఘటన జరిగిన చాలాసేపటి తరువాత పోలీసులు చేరుకోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ శ్లోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రోడ్డుపై నియంత్రణ లేకుండా వాహనాలు అతివేగంతో వెళ్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram