Jangama | మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి దుర్మరణం

జనగామ జిల్లారఘునాథపల్లిలో రోడ్డు పక్కన ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు

  • By: Somu |    telangana |    Published on : May 13, 2024 4:50 PM IST
Jangama | మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి దుర్మరణం

విధాత : జనగామ జిల్లారఘునాథపల్లిలో రోడ్డు పక్కన ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రఘునాథపల్లిలో నేషనల్ హైవేపై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్‌ను అతివేగంతో వచ్చిన ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో అక్కడ టిఫిన్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.