Lightning strike | వికారాబాద్ జిల్లాలో విషాదం.. పిడుగుపడి ముగ్గురు మృతి

వికారాబాద్‌ జిల్లా యాలాల్ మండలం బెన్నూరు గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Lightning strike | వికారాబాద్ జిల్లాలో విషాదం.. పిడుగుపడి ముగ్గురు మృతి

విధాత, హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా యాలాల్ మండలం బెన్నూరు గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు వెంకటయ్య, శ్రీనివాస్‌, లక్ష్మప్పగా గుర్తించారు. గాలివాన బీభత్సానికి పలుచోట్లు చెట్లు నేలకూలాయి. కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.