Jurala Project | జూరాల వద్ద కృష్ణమ్మ జల సవ్వడి.. 42 గేట్లు ఎత్తివేత
Jurala Project | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు( Jurala Project ) వద్ద కృష్ణా నది( Krishna River ) ఉధృతంగా ప్రవహిస్తుంది. కృష్ణమ్మ జల సవ్వడిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
Jurala Project | హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు( Jurala Project ) వద్ద కృష్ణా నది( Krishna River ) ఉధృతంగా ప్రవహిస్తుంది. కృష్ణమ్మ జల సవ్వడిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు 16 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తుంది.
ఇక జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.790 టీఎంసీలుగా ఉన్నది.
కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో.. నాగార్జున సాగర్ కూడా నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 16 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 3.83,170 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,15,483 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,34,176 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram