Takkallapally Srinivasa Rao | మోడీ బీహార్, ఏపీలకే ప్రధాన మంత్రినా..? తెలంగాణ పై బీజేపీకి సవతి తల్లి ప్రేమ : తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మరోసారి మొండి చేయి చూపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు పేర్కొన్నారు. మంగళవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

Takkallapally Srinivasa Rao | మోడీ బీహార్, ఏపీలకే ప్రధాన మంత్రినా..? తెలంగాణ పై బీజేపీకి సవతి తల్లి ప్రేమ : తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

విధాత, వరంగల్ ప్రతినిధి :కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మరోసారి మొండి చేయి చూపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు పేర్కొన్నారు. మంగళవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ ప్రజలు తిరస్కరించిన బలహీన ప్రధానమంత్రి అయిన మోడీ ఏపీ, బీహార్ సీఎం లకు భయపడి అధిక నిధులు కేటాయించారని అన్నారు. పార్లమెంటు ఉన్నది పార్టీల కోసం కాదు దేశం అన్న ప్రధాన మంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు బీహార్, ఏపీ రాష్ట్రాలకే అధిక నిధులు కేటాయించారని, మోడీ దేశానికి ప్రధాన మంత్రా, బీహార్, ఏపీ రాష్ట్రాలకా అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపినందుకు, విభజన హామీల సందర్భంగా ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, అధిక నిధులు రాబట్టడంలో విపలమై నందుకు వెంటనే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశములో అన్ని ప్రాంతాలను, రాష్ట్రాలను సమానంగా, సమపాళ్లలో చూడవలసిన దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించి, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పూర్తిగా వదిలేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.