Navneet Kaur | బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌కౌర్‌పై కేసు నమోదు

మహారాష్ట్రాలోని అమరావతి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, తాజామాజీ ఎంపీ నవనీత్‌కౌర్ తెలంగాణలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు

Navneet Kaur | బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్‌కౌర్‌పై కేసు నమోదు

విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రాలోని అమరావతి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, తాజామాజీ ఎంపీ నవనీత్‌కౌర్ తెలంగాణలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్ ప్రచార సభలో కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.

అంతకుముందు నవనీత్‌కౌర్ గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఓవైసీ ఓ సందర్భంలో పోలీసులు 15నిమిషాలు పక్కకు తప్పుకుంటే తామేంటో చూపిస్తామని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి… మీకైతే 15 నిమిషాలు.. మాకు 15 సెకన్లు చాలని, ఒవైసీ బ్రదర్స్‌ ఎక్కడ నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా చేస్తామన్నారు. నవనీత్‌కౌర్ చేసిన వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసేవిధంగా ఉండటంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.