తప్పతాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు … మత్తులో స్కూల్ బయటే పడిపోయిన వైనం

తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది

తప్పతాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు … మత్తులో స్కూల్ బయటే పడిపోయిన వైనం

విధాత : తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో పొద్దున్నే ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో పాఠశాలకు వచ్చి స్కూల్ బయటే పడిపోయాడు. స్పృహలో లేని స్థానికులు అతడిని గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. వీరయ్య మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నించగా, అతడు పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం అని స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయన్న వాదనకు వీరయ్య ఘటన నిదర్శనంగా నిలిచింది.