పులి పిల్ల కాదు.. అడవి పిల్లి

గాజుల రామారం గ్రామంలో అడవి పిల్లి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. గాజులరామారం వీధుల్లో చెట్ల మధ్య సంచరిస్తున్న అడవి పిల్లిని చిరుతపులి పిల్లగా భావించిన స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు

  • By: Somu |    telangana |    Published on : May 30, 2024 11:21 AM IST
పులి పిల్ల కాదు.. అడవి పిల్లి

విధాత: గాజుల రామారం గ్రామంలో అడవి పిల్లి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. గాజులరామారం వీధుల్లో చెట్ల మధ్య సంచరిస్తున్న అడవి పిల్లిని చిరుతపులి పిల్లగా భావించిన స్థానికులు భయాందోళనతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం అడవి పిల్లిని స్థానికుల సహకారంతో అటవీ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.

తరువాత దానిని తిరిగి అడవిలోకి వదలనున్నారు. పట్టుబడిన అడవి పిల్లిని చూసిన గ్రామస్తులు తాము దానిని పులి పిల్లగా భావించి ఆందోళన చెందామని, అది పిల్లి పిల్ల అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నామంటూ యధావిధిగా రోజువారి మాదిరిగానే ఎవరి పనులకు వారి వెళ్లిపోయారు.