Bribe : రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏసీబీ నర్సింహారావును రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టి ఇర్రాసించారు, వ్యవసాయ శాఖలో అవినీతి వెలుగులోకి.

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి
విధాత : ఏసీబీ ఎన్ని దాడులు చేసి.. అరెస్టులు చేస్తున్నా లంచావతారుల తీరు మారడం లేదు. డబ్బులకు ఆశపడి టేబుల్ కింద చేతులు పెడుతున్నారు. తాజాగా సోమవారం కొత్తగూడేం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి రూ.50వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో రూ.25వేలు ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులతో కలిసి పథకం పన్నారు. కాగా, తన కార్యాలయంలో నర్సింహారావు తన ఆఫీసులో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి మండలంలోని బంగారు చెలగ గ్రామంలో యూరియా అమ్మకాలు చేస్తున్న ఫెర్టిలైజర్ షాపు యజమానిని తన కార్యాలయానికి పిలిచి షాపునకు సంబంధించి సరైన ధృవపత్రాలు లేవని చెబుతూ రూ.50 వేలు డిమాండ్ చేశాడన్నారు. లంచం ఇవ్వకపోతే షాపు సీజ్ చేస్తామని బాధితుడిని అధికారి బెదిరించాడని తెలిపారు. దీంతో షాపు యజమాని ఏసీబీని ఆశ్రయించాడని, షాపు ఓనర్ ను లంచం అడిగిన వాయిస్ రికార్డుతో పాటు రూ. 25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ పేర్కొన్నారు.