TTD : డిక్లరేషన్ ఇవ్వకుంటే అనుమతించం

ఏపీ సీఎం జగన్ తిరుమల దర్శనానికి డిక్లరేషన్ సంతకం చేయాల్సిందా? టీటీడీ ఆదేశాలు, భక్తుల ఆవేదనతో రేపు ఉద్రిక్తత.

TTD : డిక్లరేషన్ ఇవ్వకుంటే అనుమతించం

రేపు తిరుమలకు జగన్
డిక్లరేషన్‌పై సంతకం పెడతాడా?

విధాత : ఈ నెల 27న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. గతంలో జగన్ ప్రతిపక్షం లో ఉన్నా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఎప్పుడూ డెక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. అయితే, బుధవారం పర్యటనలో అయినా డిక్లరేషన్ పై జగన్ సంతకం చేస్తాడా ! వివాదం చేస్తాడా! సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా ! అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. డిక్లరేషన్ పై సంతకం లేకుండా జగన్ మోహన్ రెడ్డి ను దర్శనానికి అనుమతించబోమని ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. టీటీడీ నియమ నిబంధనలు ప్రకారం జగన్ సంతకం చేయాల్సిందేనని టీటీడీ ఈఓ స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ (అన్యమతస్తుడు) కావడంతో నే డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ కోరుతోంది. మరోవైపు వేంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉంటే సంతకం పెట్టి తీరాలని భక్తజనం డిమాండ్ చేస్తున్నారు. విదేశాల నుంచి ప్రముఖలు ఎవరూ వచ్చినా, దేశంలోని అన్యమతస్తులు కూడా సంతకం చేసిన తరువాతే దర్శనం చేసుకుంటున్నారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో పెట్టి జగన్ సొంత మీడియా సాక్షి పేపర్, టీవీ తో పాటు వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు.