Rangareddy : ల్యాండ్ రికార్డు ఏడీ అక్రమాస్తులు రూ.100కోట్లపైనే!
రంగారెడ్డి రికార్డు ఏడీ శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు బయటపడ్డాయి. భూములు, ప్లాట్లు, రైస్ మిల్, విలాసవంతమైన ఆస్తులు గుర్తింపు.
విధాత : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, రికార్డుల శాఖ ఏడీ కొంతం శ్రీనివాస్ పై ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో రూ.100కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించినట్లుగా ఏసీబీ వెల్లడింది. సోదాల్లో రాయదుర్గ్‌లోని మైహోం భుజాలో ఒక ప్లాట్, నారాయణపేట జిల్లా హిందుపూర్ శివారులో కోట్ల విలువైన ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రైస్ మిల్, కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీ అనంతపూర్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో మూడు ప్లాట్లకు సంబంధించిన దస్త్రాలు గుర్తించినట్లు తెలిపారు.
శ్రీనివాస్ సోదరుల ఇండ్లల్లో రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, ఒక కియా కారు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. స్థిర చరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తనిఖీల్లో సీఐ ఆకుల శ్రీనివాసులు, సిబ్బంది నారాయణపేట, జిల్లా సివిల్ పౌరసరఫరాల డీటీ గురు రాజారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు. వివిధ సామాజిక మాధ్యమాలైన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Nalgonda : ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్ధార్
Akhanda 2 | ఈ రోజు రాత్రే అఖండ 2 ప్రీమియర్ షోస్.. సమస్యలన్నీ తొలగిపోయినట్టేనా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram