Nizamabad | నిజామాబాద్ మున్సిపల్ సూపరిండెంట్ నివాసంలో ఏసీబీ దాడులు
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ నిర్వహించిన సోదాలలో కోట్ల రూపాయల నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతుంది
కోట్ల రూపాయల నగదు స్వాధీనం
విధాత, హైదరాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ నిర్వహించిన సోదాలలో కోట్ల రూపాయల నగదు స్వాధీనం కావడం సంచలనం రేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఇంట్లో రూ. 2.93 కోట్ల నగదు లభించగా, రూ. 1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ. 1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లుగా తేల్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram