Prajavani | సీఎం ప్రజావాణిలో దూరవిద్య బాధిత విద్యార్థులు.. న్యాయం చేసేందుకు చిన్నారెడ్డి భరోసా

Prajavani | ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పట్టాల గుర్తింపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన 1.24 లక్షల మంది విద్యార్థులు సీఎం ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. వారి బాధలు విన్న ప్రజావాణి ఇంచార్జి చిన్నారెడ్డి.. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Prajavani | విధాత, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య విధానం లో కోర్సులు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల 524 మంది భవిష్యత్తును కాపాడాలని కోరుతూ పలువురు ” సీఎం ప్రజావాణి “లో ఏకరవు పెట్టారు. ప్రజావాణి ఇన్ ఛార్జీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జీ. చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణికి పెద్ద ఎత్తున దూర విద్య బాధితులు తరలివచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పలు యూనివర్సిటీల లు దూరవిద్య విధానం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించాయని తెలిపారు. కోర్సులను పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాయని, తద్వారా డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు 2021 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు లభించాయని వారు తెలిపారు. 2

022 లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పట్టాలు అంగీకరించమని చెప్పడంతో కోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. ఏపీ హైకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చినా ఉద్యోగ అవకాశాలలో నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పట్టాలు పరిగణలోకి తీసుకునే సమస్య లేదని చెప్పడంతో తెలంగాణ కు చెందిన ఒక లక్ష 24 వేల 524 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న చిన్నారెడ్డి స్పందిస్తూ విద్యాశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దూరవిద్య బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

Read More:

తెలంగాణలో అప్పుడే బీఆర్ఎస్ నేతల ‘అధికార’ ఆశలు

మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌: మంత్రి దామోదర

Latest News